కమల్ హాసన్-శంకర్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చెందుకు సిద్దమైన ఇండియన్ 2 చిత్రం రిలీజ్ పై ప్రస్తుతం గందరగోళం ఏర్పడింది. గత నెలలోనే ఇండియన్ 2 జూన్ లో రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇండియన్ 2 ఇపుడు జూన్ లో వచ్చే అవకాశం లేదు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది.
కల్కి జూన్ 27 న రావడంతో ఇండియన్ 2 జూన్ 13 న విడుదల చెయ్యడం కరెక్ట్ కాదనే ఆలోచనలో మేకర్స్ ఉండడంతో.. ఇప్పుడు ఇండియన్ 2 ని జులై కి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇండియన్-2 కొత్త డేట్‌ను దాదాపు ఓకే చేసుకున్నట్లుగా సమాచారం. జులై 18న ఇండియన్-2 చిత్రాన్ని రిలీజ్ చేయాలని శంకర్ అండ్ టీమ్ ఫిక్సయ్యారని టాక్.
ఇండియన్-2 జూన్ నుంచి జులై కి అంటే ఒక్క నెల మాత్రమే మేకర్స్ పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు.. కాబట్టి ఇండియన్-2 రిలీజ్ పై కమల్ అభిమానులు ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు.. సంబరాలకు రెడీ అవ్వండి మరి.!