ఇస్మార్ట్ శంకర్ ని ఇప్పటికి బుల్లితెర మీద చూడగానే మాస్ ఆడియన్స్ విజిల్స్ వేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ మాస్ కేరెక్టర్ లో ఇరగ్గొట్టేసాడు. ఆ చిత్రానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరి-రామ్ కాంబోలో మరో మూవీ మొదలైంది. అసలైతే ఈ చిత్రం మార్చ్ లో మహా శివరాత్రికి విడుదల కావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వలన ఈ చిత్రాన్ని జూన్ కి పోస్ట్ పోన్ చేసారు. ప్రస్తుతం ముంబైలో మాసివ్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్న ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మే 15, 2024న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్-ఛార్మి ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర లో కనిపించనున్నారు.