మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం మేనమామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం ప్రచారానికి దిగాడు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మేనమామకు మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. అందులో భాగంగా సాయి దుర్గ తేజ్ తాటిపర్తిలో నిర్వహించిన సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో సాయి తేజ్ పై దాడికి పాల్పడ్డారు.
ఆ దాడిలో సాయి తేజ్ పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. సాయి తేజ్ తప్పించుకున్నప్పటికీ తేజ్ పక్కనే నిలుచున్న శ్రీధర్ కు మాత్రం పెద్ద గాయమైంది. కంటి మీదుగా తగిలిన దెబ్బతో శ్రీధర్ ను జనసేన కార్యకర్తలు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సాయి తేజ్ జనసేన ప్రచారానికి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు కవ్విస్తూ టపాసులు పేలుస్తూ జనసైనుకులని రెచ్చగొట్టారు.
అంతేకాకుండా వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్యలో వాదోపవాదాలు, గొడవలతో నానా హంగామా చేసారు. సాయి తేజ్ కాన్వాయ్ తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అది సూటిగా వచ్చి సాయి తేజ్ పక్కనే ఉన్న శ్రీధర్ కు తాకింది. దీంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఇదంతా వంగ గీత అనుచరులే చేయించారంటూ జన సైనికులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ అయ్యింది.