Advertisement
Google Ads BL

జగన్ రెడ్డికి ఝలక్.. డీజీపీ ఔట్!!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా.. ఆయన చెప్పిందే వేదం.. శాసనం అని భావించి ఆంధ్రాను ఏలిన పోలీస్ బాస్ డీజీపీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ రెడ్డి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. మరోవైపు.. తదుపరి డీజీపీ ఎవరనే విషయంపై ముగ్గురు పేర్లతో ప్యానల్‌ను పంపాలని 

Advertisement
CJ Advs

రాష్ట్ర సీఎస్‌ జవహర్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సోమవారం 11 గంటలలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని కూడా ప్రభుత్వాన్ని ఈసీ కోరింది.

వాస్తవానికి.. 

సీఎం జగన్ సొంత జిల్లా.. సొంత సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర నాథ్ పదవిలో కూర్చున్న తొలి రోజు నుంచే వైసీపీకి అనుకూలంగా.. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పని చేశారనే అపకీర్తి మూట కట్టుకున్నారు. అందుకే పదే.. పదే ప్రతిపక్ష పార్టీల నేతలు డీజీపీనీ గురుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఖాకీ దుస్తులు వేసుకున్న వైసీపీ కార్యకర్తలా పని చేశారనే ఆరోపణలు కోకొల్లలు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. కార్యకర్తలపై ఏం జరిగినా సరే మొద్దు నిద్రలో ఉండేవారు. అదే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలకు ఏమైనా ఐతే మాత్రం ఉగ్రరూపం దాల్చడం ఈయన నైజం. ఇలా ఎంతో మంది ప్రతి పక్షాల పార్టీ నేతలను ఇబ్బంది పెట్టీ.. అరెస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

ప్రశ్నిస్తే.. జైలే..!

ఇక వైసీపీ ప్రభుత్వంపై, జగన్ రెడ్డిని పోల్లెత్తి మాట మాట్లాడినా.. సోషల్ మీడియాలో విమర్శించినా సరే మరుసటి రోజు ఏదో ఒక సాకుతో వారిని అరెస్ట్ చేసేవారు. ఆఖరికి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ధర్నాలు, నిరసనలు చేసినా సరే ఉక్కు పాదం మోపి.. గృహ నిర్భందం చేసేవారు. ఇలాంటి పరిణామలపై టీడీపీ.. గవర్నర్ మొదలుకుని.. ఇప్పటి ఎన్నికల కమిషన్ వరకూ పిర్యాదులు చేసి చేసి అలసిపోయింది. ఆఖరికి ఇప్పుడు రాజేంద్రపై వేటు పడింది. ఇప్పుడు ఆ సీటులోకి ఎవరు వస్తారు..? వచ్చే వ్యక్తి ఎలా ఉంటారు..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా తన అనుకున్న వ్యక్తిని జగన్ రెడ్డి నుంచి దూరం చేయడంతో సీఎం లెఫ్ట్ హ్యాండ్ తీసేసినట్టుగా ఉందని సొంత పార్టీ నేతలు నెట్టింట్లో చర్చించుకుంటున్న పరిస్థితి. 

Jhalak for Jagan Reddy.. DGP out!!:

EC orders immediate transfer of Andhra DGP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs