మే 20 న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బర్త్ డే. ఆ రోజున ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఖచ్చితంగా ఏదో ఒక ట్రీట్ అయితే ఉంటుంది. ఇది ఫిక్స్. ఎన్టీఆర్ ఫాన్స్ దేవర ట్రీట్ ని ఊహించుకుంటూ అప్పుడే సంబరాలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నటుగా ప్రచారమైతే జోరుగా జరుగుతుంది.
దేవర కి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి తమిళనాట బ్యాండ్ వాయించేస్తున్న అనిరుద్ క్రేజ్ దేవర కి పక్కాగా క్రేజ్ తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు. విక్రమ్, జైలర్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అవడంలో అనిరుద్ మ్యూజిక్, BGM పాత్ర ఎంతుందో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే ఇప్పుడు దేవర సింగిల్ పై అంచనాలు పెరుగుతున్నాయి. అందరి చూపు అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చే మ్యూజిక్ పైనే ఉంది. అనిరుధ్ దేవర కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో.. దేవర మొదటి సింగిల్ ఎంతెలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.