Advertisement
Google Ads BL

బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసిన లైగర్ బ్యూటీ


విజయ్ దేవరకొండ లైగర్ తో సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ఆ చిత్రం డిస్పాయింట్ చెయ్యడంతో.. మళ్ళి బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. అక్కడ ఒకటి రెండు అవకాశాల తో కనిపిస్తున్న ఆమె ఆదిత్య రాయ్ కపూర్ తో ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉంది. ఎక్కడికి వెళ్లినా కలిసి జంటగా వెళ్లేవారు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లోను అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ కలిసి కనిపించారు. ఇప్పుడు ఈ క్రేజీ జంట బ్రేకప్ చెప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ లు అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తర్వాత కలిసి కనిపించలేదు. 

అయితే అనన్య-ఆదిత్య కామన్ ఫ్రెండ్ ఒకరు.. అనన్య-ఆదిత్యలు ఒక నెల ముందే బ్రేకప్ చెప్పుకున్నారంటూ చెప్పడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మార్చ్ లోనే ఈ జంట కి బ్రేకప్ అయ్యింది అని, ఆ తర్వాత అనన్య పాండే తన పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతూ ఆ బాధను మరిచిపోయే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. 

Ananya Panday And Aditya Roy Kapur Part Ways:

Ananya Panday and Aditya Roy Kapur part ways, close friend says break up came as shock
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs