ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఎలక్షన్స్ హీట్ ఎండ వేడికన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఏపీలో వైసీపీ vs కూటమి మధ్యలో బిగ్ ఫైట్ అన్నట్టుగా ప్రచారాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తెలంగాణలో కూడా కెసిఆర్ vs రేవంత్ రెడ్డి అంటూ అదే ఎన్నికల హీట్ కనిపిస్తుంది. అయితే ఏపీలో సినిమావాళ్లెవరూ ఈ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. కేవలం జబర్దస్త్ బ్యాచ్ తో పాటుగా మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు.
ఇక్కడ తెలంగాణాలో అయితే కూతురు మామగారు కోసం వెంకటేష్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఏపీలో సినీ సెలబ్రిటీస్ ప్రచారం చెయ్యకుండా కామ్ గా కనిపించడంతో.. సోషల్ మీడియాలో హీరోల పేర్ల మీద ఫేక్ పబ్లిసిటీకి తెర లేపారు కొంతమంది ఆకతాయిలు.
అందులో ముఖ్యంగా నాగార్జున టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టుగా, టీడీపీ కి సపోర్ట్ చెయ్యమని తనని బలవంతపెడుతున్నట్టుగా పోస్టర్ తయారు చేసారు. అదే నాగార్జున పేరు మీద మరొక పోస్టర్ లో.. సినిమా వాళ్లంతా హైదరాబాద్ లో ఉండి ఏపీ ఎన్నికలపై మట్లాడడం కరెక్ట్ కాదు, అక్కడ ఎవరికీ సపోర్ట్ చెయ్యక్కర్లేదు, ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాగానే నడుస్తుంది అంటూ నాగార్జున ట్వీట్ వేసినట్టుగా మరొక పోస్టర్ తయారు చేసారు.
ఇక నాని అయితే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి ఓటేయమని చెప్పినట్టుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ ఫేక్ పబ్లిసిటీ పై ఆయా హీరోలు తమ పీఆర్వో ల నుంచి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఫేక్ పబ్లిసిటీతో హీరోలంతా సతమతమవున్నారు.