మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ చిత్రం విశ్వంభర. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శరవేగంగా ముస్తాబవుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా త్రిష బర్త్‌డేను పురస్కరించుకుని.. ఆమె ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా.. అబ్బ, ఏముందిరా విశ్వంభరలో త్రిష అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ లుక్‌లో త్రిష చాలా బాగుంది. మెడలో వజ్రాల హారంతో.. మెరూన్ కలర్ లెహంగాలో బ్యూటీకే బ్యూటీ అనేంత అందంగా త్రిష ఈ పిక్‌లో దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టాలిన్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో చిరు సరసన ఆమె జతకడుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనేలా టాక్ వినిపిస్తోంది.
రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించి AS ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌లో మ్యాసీవ్ స్టంట్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరించారు. ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో చిత్రీకరించబడింది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులు, మాసెస్‌ను థియేటర్లలో మెస్మరైజ్ చేయనుందని మేకర్స్ వెల్లడించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.