Advertisement
Google Ads BL

యష్ చిత్రం నుంచి తప్పుకున్న కరీనా కపూర్?


కన్నడ స్టార్ హీరో యష్ KGF సీరిస్ తర్వాత ఎలాంటి చిత్రాన్ని ఎంచుకుంటాడు, ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో అనే ఆత్రుత ఆయన అభిమానుల్లోనే కాదు పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ కనిపించింది. ఏడాదిన్నరగా యష్ కొత్త చిత్ర కబురు కోసం సినీ జనాలు వెయిట్ చేసారు. ఫైనల్లీ యష్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటిస్తుంది అన్నారు. 

Advertisement
CJ Advs

అటు కరీనా కపూర్ కూడా తానొక సౌత్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లుగా హింట్ ఇచ్చింది. కరీనా కపూర్ నటించేది యష్ టాక్సిక్ లోనే అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే కరీనా కపూర్ యష్ తో రొమాన్స్ చెసే పాత్ర కాదు.. ఆమె యష్ కి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించబోతుంది అన్నారు. కరీనా పోషించే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది అని, చాలా డిఫెరెంట్ రోల్ అని ముందునుండి ప్రచారం జరుగుతుంది.

బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో పాటుగా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుంది అనే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు కరీనా కపూర్ ఆ పాత్ర చెయ్యడం లేదట. అంటే టాక్సిక్ నుంచి కరీనా తప్పుకుంది అంటున్నారు. సరైన కాల్షీట్లు అందుబాటులో లేక.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం తో టాక్సిక్ సినిమాను కరీనా వదులు కోవాల్సి వచ్చింది అని తెలుస్తోంది. 

Kareena Kapoor Walks Out Of Yash Toxic? :

Kareena Kapoor out of Yash Toxic due to the date issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs