పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ హ్యాట్రిక్ డిజప్పాయింట్ మెంట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ పార్ట్ 1 తో ఊరట లభించింది. గత ఏడాది డిసెంబర్ లో థియేటర్స్ లో విడుదలైన సలార్ 1 బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ప్రభాస్ ని ఆయన అభిమానులని ఖుషి చేసింది. సలార్ 700 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టడంతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది.
ఈ చిత్రం జనవరిలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లోను సలార్ మంచి వ్యూస్ రాబట్టింది. రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సలార్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అప్పటినుంచి సలార్ బుల్లితెర మీద తెచ్చుకోబోయే టీఆర్పీ పై అందరిలో ముఖ్యంగా ప్రభాస్ ఫాన్స్ లో విపరీతమైన ఆసక్తి మొదలైంది.
స్టార్ మా లో సలార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రానికి అతి దారుణమైన టీఆర్పీ రావడం ప్రభాస్ అభిమానులను బాగా డిస్పాయింట్ చేసింది. సలార్ పార్ట్ 1 కి కేవలం 6.5 TRP రేటింగ్ వచ్చింది. ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి కి, డిసాస్టర్ అయిన ఆదిపురుష్ కి కూడా 20 లో పైనే రేటింగ్ రావడంతో సలార్ వాటిని మించి టీఆర్పీ రాబడుతుంది అనుకుంటే.. సలార్ కి మరీ డిజప్పాయింట్ చేసే 6.5 రేటింగ్ రావడం పట్ల ఆయన అభిమానులు చాలా అంటే చాలా డీలా పడిపోయారు.