బాలీవుడ్ కి వెళితే సౌత్ భామలంతా అందాలు ఆరబోసేందుకు సిద్ధం అవుతారనే నానుడిని రాశి ఖన్నా నిజం చేసింది. అసలే గ్లామర్ భామ.. మోడ్రెన్ పాత్రలతో మత్తెక్కించే రాశి ఖన్నా బాలీవుడ్ లో అడుగుపెట్టిందో, లేదో.. అక్కడి కల్చర్ ని బాగా వంట బట్టించుకుంది. ఫార్జి వెబ్ సీరీస్ తో పాటుగా యోధా చిత్రంతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరైంది. అంతేకాదు గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటోలని షేర్ చేస్తూ యూత్ ని పడేసే రాశి ఖన్నా తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ చూడగానే పాప ఫైర్ మీదుంది అంటారు. Black magic 🖤 అంటూ మోడ్రెన్ వేర్ లో రాశి ఖన్నా అందాలు చూపిస్తూ మతులు పోగొట్టేసింది. నిజంగా రాశి ఖన్నా ఫుల్ ఫైరుమీదుంది.
ఇక నార్త్ కి వెళ్ళింది. సౌత్ ఇండస్ట్రీలో రాశి ఖన్నా పనైపోయింది అనుకుంటే.. ఇక్కడ కూడా రాశి ఖన్నా బిజీగా మారబోతుంది. నితిన్ తో మరోసారి జోడి కట్టబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలోస్తున్నాయి. అది చూసిన నెటిజెన్స్ అమ్మడి సోషల్ మీడియా గ్లామర్ వృధాగా పోలేదులే అంటూ కామెంట్ చేస్తున్నారు.