Advertisement
Google Ads BL

అక్కినేని హీరోలు గొడుగు పట్టాల్సిందేనా !!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో ప్రత్యేకత ఉంది. మీసం తిప్పాలన్నా, తొడ కొట్టాలన్నా, డైలాగ్స్ ని డైనమెట్స్ లా పేల్చాలన్నా నందమూరి కథానాయకులకు చెల్లుతూ వస్తుంది. అలాగే డాన్స్ లో గ్రేస్ చూపించాలన్నా, స్టైలింగ్ లో ట్రెండ్స్ చూపించాలన్నా, ఆన్ స్క్రీన్ ఆల్రౌండ్ అప్పీరియన్స్ ఇవ్వాలన్నా మెగా హీరోల వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది. అలాగే అక్కినేని హీరోలకు ఓ ప్రత్యేకతుంది. 

Advertisement
CJ Advs

ఏఎన్నార్ నుంచి నాగార్జున వరకు నడిచిన లెగసీలో రొమాంటిక్ హీరోలుగా ఆ వంశానికి ఓ స్పెషాలిటీ క్రియేట్ అయ్యింది. అయితే అది పక్కనపెట్టేసి ప్రయోగాలు చేస్తూ పోతున్నారు అక్కినేని కథానాయకులు. ఎదురు దెబ్బలు తగులుతున్నా ఎక్స్పెరిమెంట్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. 

అఫ్ కోర్స్.. నా సామిరంగా సినిమాతో నాగార్జున కాస్త రిలీఫ్ వచ్చింది. దూత వెబ్ సీరీస్ తో నాగ చైతన్యకి కొంచెం బూస్టప్ లభించింది. అఖిల్ మాత్రం ఇప్పటికి అదృష్టం తలుపు తడుతూనే ఉన్నాడు. చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రత్యేకించి ఈ ముగ్గురి ప్రస్తావన ఎందుకంటే.. 

ఒకే వంశపు హీరోల అంశం కలిసిందో కాక కాకతాళీయంగానే జరిగిందో.. ఏదైతేనేం ముచ్చటగా ముగ్గురు హీరోలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో గొడుగులు పట్టుకుని దిగిన విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యచకితులని చేస్తుంది. మొదట ఏజెంట్ ఫస్ట్ లుక్ కోసం గొడుగు పట్టుకున్న అఖిల్ లుక్ ని అందరూ చూసారు. తమ్ముడికి ఫెయిల్యూర్ వచ్చినా తగ్గేదేలే అంటూ అదే గొడుగు పట్టుకుని దూతగా దర్శనమిచ్చాడు నాగ చైతన్య. 

ఇప్పుడిక నాగార్జున వంతొచ్చింది. కుబేరాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కీలక పాత్ర చేస్తున్న నాగార్జున ఫస్ట్ లుక్ నేడు రివీలయ్యింది. విశేషమేమిటంటే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో స్వయంగా నాగ్ కూడా గొడుగు పట్టుకునే అడుగుపెట్టారు. ఈ మూడు ఫోటోలని పక్క పక్కనే చూస్తుంటే మీకు ఇదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ..! బహుశా అక్కినేని హీరోలు రంగంలోకి దిగాలంటే చేతులో గొడుగుండక తప్పదేమో..!

Do Akkineni's heroes have to take an umbrella!!:

3 Akkineni heroes first look in umbrella
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs