Advertisement
Google Ads BL

చీ.. ఛీ.. నారా లోకేష్‌పై ఇంత దారుణమా..!


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య పైత్యం పెరిగిపోతోంది. ప్రతిపక్షాలు పది అంటే.. మేము అంతకుమించే అంటామని అధికార వైసీపీ పక్షం రచ్చ చేస్తోంది. ఇలా మాటల యుద్ధంలో కానీ.. చేతల్లో కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. ఆఖరికి ఫేక్‌లు సృష్టించడంలోనూ రెండు పార్టీలు పీహెచ్‌డీనే చేశాయి. నిన్న, మొన్నటి వరకూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై డీప్ ఫేక్ ఆడియో సృష్టించి ఎలా వైరల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీనిపై క్లారిటీ రావడంతో ఆ వివాదం అలా సద్దుమణిగిందో లేదో.. మరో ఫేక్‌ వార్తలను తయారు చేసి హడావుడి మొదలుపెట్టింది వైసీపీ. ఈసారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ దారుణాతి దారుణంగా ఓ స్కామ్‌లో ఇరుక్కున్నట్లు వైరల్ చేయడం సిగ్గుచేటు.

Advertisement
CJ Advs

అసలేం జరిగింది..?

కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారం రాష్ట్రాన్ని, జేడీఎస్ పార్టీని ఏ రేంజ్‌లో కుదిపేస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యనే జేడీఎస్.. ఎన్డీఏలో చేరడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్న ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒకటి రెండు కాదు 3వేలకు పైగా పెన్‌డ్రైవ్‌లలో వీడియోలు, 2500 మంది రేవణ్ణ బాధితులు ఉన్నట్లు తేలింది. ఇప్పుడీ వ్యవహారం రచ్చ రచ్చగా మారడంతో దీన్ని నారా లోకేష్‌కు అంటగట్టింది వైసీపీ. ఒకానొక సందర్భంలో రేవణ్ణను లోకేష్ కలిసున్నట్లు ఉన్న ఫొటోను పెట్టి ఈ స్కామ్‌లో చినబాబు ఉన్నట్లు ఓ దినపత్రికలో ప్రచురించినట్లుగా రాసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణతో లోకేశ్‌కు సత్సంబంధాలు ఉన్నాయని.. పలు పెన్ డ్రైవ్‌లలో లోకేష్ నీలి చిత్రాలు కూడా బట్టబయలు అయినట్లు ఆ పేపర్ కటింగ్స్‌లో ఉంది. అంతేకాదు.. విచారణకు హాజరుకావాలని లోకేష్‌కు నోటీసులు కూడా జారీ చేశారని టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ టీవీ చానెల్‌ పేరిట బ్రేకింగ్స్ కూడా ఫేక్‌వి సృష్టించి రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు.

ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నట్లు..?

మరీ ముఖ్యంగా ఇదంతా తెలిసిన చంద్రబాబు.. ప్రస్తుతం ఎన్డీఏలో ఉండటంతో ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా హ్యాండిల్ చేస్తున్నారనే విషయాన్ని గోబెల్ ప్రచారం చేస్తోంది వైసీపీ. ఇదంతా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిందని.. ఆ సమయంలో రెండు నెలలపాటు లోకేష్ కనిపించకుండా పోయారనే కట్టు కథలు అల్లిన వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అసలే సోషల్ మీడియా కాలం.. చిన్నపాటి విషయాన్ని ఎంత వైరల్ చేయొచ్చో తెలియనిదేమీ కాదు.. అలాంటిది ఎన్నికల ముందు ఇంత హడావుడి జరుగుతుంటే టీడీపీ ఎందుకు స్పందించలేదన్నది గమనార్హం. కనీసం ఇది అచ్చు తప్పు అని కానీ.. ఇలాంటి ఫేక్ సృష్టించిన వారిపై, వైరల్ చేస్తున్న వారిపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని పొల్లెత్తి మాట్లాడకపోవడం గమనార్హం. దీంతో గంట గంటకూ మరింత రెచ్చిపోయి ఇంకొందరు వైరల్ చేస్తున్న పరిస్థితి.. ట్విట్టర్‌లో ఉంది. ఇకనైనా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలపై.. టీడీపీ నుంచి రియాక్షన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నికల టైమ్.. ఇలాంటి చిన్న చిన్నవే ఊహించని రీతిలో డ్యామేజ్ చేసేస్తుంటాయ్.. అందుకే ఇప్పటికైనా టీడీపీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.. ఇక ఇలాంటి పైత్యం ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు కార్యకర్తలను అధికార పార్టీ హెచ్చరించాల్సి ఉంది.

Nara Lokesh:

YCP vs Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs