Advertisement
Google Ads BL

రేవంత్‌కు ఊపిరాడనివ్వని మోదీ, కేసీఆర్!!


మోదీ, కేసీఆర్‌ దెబ్బకు రేవంత్ ఉక్కిరిబిక్కిరి!

Advertisement
CJ Advs

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాలేదు.. ఇంతలోనే ఊహించని పరిణమాలే జరిగిపోతున్నాయ్!. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్కడిని చేసి ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నడుస్తున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొద్దిరోజుల పాటు కారు పార్టీ నేతలు ఎక్కడా కనిపించలేదు.. నేతలు గొంతులూ వినిపించలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిందో ఇక రేవంత్‌పై ఒక్కటే దాడి.. ఎవరి నోట విన్నా సీఎం పేరే.. ఎవరు చూసినా విమర్శించే వాళ్లే. అయినా సరే రేవంత్ ఎవ్వరికీ భయపడకుండా సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరికిచ్చేవి వాళ్లకు ఇచ్చి పడేస్తూ వస్తున్నారు.

సారొచ్చారు.. ఇక షురూ..!

సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ గ్రౌండ్‌లోకి దిగిపోయి బ్యాటింగ్ షురూ చేశారు. ఇక చూస్కోండి.. ఒక్కటే సవాళ్లు, విమర్శలు, కౌంటర్లు.. దుమ్మెత్తి పోసుడే. పల్లెబాటతో ప్రారంభమై.. బస్సు యాత్రతో గులాబీ బాస్ యాత్ర నాన్ స్టాప్‌గా రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. తాగునీరు, సాగు నీరు.. కరెంట్ సరిగ్గా లేక లేక ప్రజలు, రైతన్నలు పడుతున్న ఇబ్బందులను మీడియా ద్వారా అందరికీ చాటి చెబుతూ.. రేవంత్‌ను సీఎం చేయడం వల్లే ఇదంతా.. అనుభవించండి అన్నట్లుగా రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేశారు బాస్. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టేందుకేనని, ప్రజలను రెచ్చగొట్టేందుకు ఇలా చేస్తున్నారని.. దిమ్మదిరిగేలా కాంగ్రెస్ మంత్రులు మొదలుకుని నేతల వరకూ రివర్స్ ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి రుణమాఫీ దగ్గర వచ్చి ఆగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. రాజీనామాల దాకా వెళ్లాయి. ఆగస్టు-15లోపు రుణమాఫీ చేసేస్తానని రేవంత్ రెడ్డి.. చేయని పక్షంలో పరిస్థితేంటి..? ట్రబుల్ షూటర్ హరీష్ రావు రాజీనామాకు రెడీ అయ్యారు. అసలే ఎండాకాలం.. దీనికి తోడు పొలిటికల్ హీట్‌తో నేతలు వాడివేడిగా ఉన్నారు.

మోదీ రాకతో మారిన సీన్!

ముస్లింల రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనని మాటలను అన్నారని కొందరు నేతలు డీప్ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ నేతలు తెగ పోస్టులు చేశారు. ఇదే వీడియోను రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇదంతా మార్ఫింగ్ వీడియోనని రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వరుస అరెస్టులతో కాంగ్రెస్ నేతలకు ఊపిరాడనివ్వట్లేదు. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. రేవంత్ రెడ్డికి సమన్లు ఇవ్వడం.. ఢిల్లీ నుంచి గాంధీ భవన్‌కు పోలీసులు రావడం ఇదంతా పెద్ద రచ్చగానే మారింది. దీంతో ఇంకేముంది.. రేపో మాపో రేవంత్‌ అరెస్ట్ అంటూ ఓ రేంజిలో ఊదరగొడుతున్నారు ప్రత్యర్థులు. ఈ క్రమంలోనే జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని కమిషన్లు తీసుకుంటూ ఢిల్లీకి దొడ్డిదారిన పంపిస్తున్నారని తీవ్ర ఆరోపణలే చేశారు. ఇలా ఒకట్రెండు కాదు రేవంత్‌పై చాలానే ప్రధాని ఆరోపణలు చేసి సంచలనమే సృష్టించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సీన్ మొత్తం మారిపోయింది. వాస్తవానికి మోదీ హయంలో సీఎంలు అరెస్ట్ కావడం పెద్ద వింతేమీ కాదు.. రేపొద్దున్న రేవంత్‌ను అరెస్ట్ చేసినా చేయొచ్చని ప్రచారం మాత్రంగా గట్టిగానే జరుగుతోంది.

తగ్గేదేలే..!

గత కొన్నిరోజులుగా తెలంగాణలో నడుస్తున్న రాజకీయ పరిణామాలపై రేవంత్ తీవ్రంగానే స్పందించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని కన్నెర్రజేశారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని.. గెలిచాక దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్‌ ఇచ్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి? ఈ అంశంపై తాను ప్రశ్నించానన్నారు. అందుకే.. ప్రధాని మోదీ, అమిత్‌షా నాపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. ఢిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని.. తాను కేసులకు భయపడనని ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు.. చర్లపల్లి జైలుకు కేసీఆర్‌ పంపితే తిరగబడి కొట్లాడానన్న విషయం ఈ సందర్బంగా గుర్తు చేశారు. కేంద్రం దగ్గర ర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చని.. తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారని గట్టిగా బదులిచ్చారు రేవంత్. అంతేకాదు.. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామని అనుకుంటున్నారని ఆరోపించారు సీఎం. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి జరగుతున్న ఎన్నికలే పార్లమెంట్ ఎన్నికలు. త్వరలోనే బీజేపీ కుట్రలు బయటపెడతానని.. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో అన్నీ వివరిస్తానని.. మోదీ భయపెడితే అస్సలు భయపడనని రేవంత్ తెగించి చెప్పేశారు. చూశారు కదా ఒకే ఒక్కడు రేవంత్.. మోదీ, కేసీఆర్‌లను ఎదుర్కొంటున్నారో.. మున్ముందు ఇంతకుమించి పరిణామాలు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!

Revanth suffocated by the blows of Modi and KCR!:

Will CM Revanth Reddy be arrested..!?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs