Advertisement
Google Ads BL

పుష్ప-2 ది రూల్‌ సాంగ్ వచ్చేసింది


పుష్ప పార్ట్ 1 మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 సాంగ్స్ పై అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి దేవిశ్రీ పుష్ప ద రూల్ కి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అనే ఆసక్తి కూడా మొదలైంది. సుకుమార్-అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప పార్ట్ 1 హిట్ మేజర్ పార్ట్ మ్యూజిక్ కే దక్కింది. అందుకే పుష్ప 2 ఆల్బమ్ పై అందరిలో అన్ని అంచనాలు. ఇక మే డే అంటే మే 1 న పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ పుష్ప.. పుష్ప సాంగ్ వదులుతున్నట్టుగా మేకర్స్ గత రెండు రోజులుగా ఊరిస్తూ వస్తున్నారు. 

Advertisement
CJ Advs

అనుకున్నట్టుగానే  ఈరోజు బుధవారం మే 1 సాయంత్రం 5.04 నిమిషాలకి పుష్ప‌... పుష్ప‌...పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్ద‌రిలే సాంగ్ ని వదిలారు. అదిరిపోయే సంగీతం, మెస్మ‌రైజ్ చేసే విజువ‌ల్స్‌, హైక్లాస్ మేకింగ్‌, ఊర‌మాస్ స్టెప్స్‌, క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్‌, విన‌గానే వావ్ అనిపించే లిరిక్స్‌.. ఇలా ఒక‌టేమిటి ఈ పాట వింటూంటే అంద‌రికి గూజ్‌బంప్స్‌ వస్తున్నాయంటూ అల్లు అభిమానులు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. 

చంద్ర‌బోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్‌గా పూర్తి క‌మ‌ర్షియ‌ల్‌గా సాంగ్‌గా వుంది.  చిత్రంలో పుష్ప ది రూల్‌ను ఎలివేట్ చేసే విధంగా, పుష్ప క్యారెక్ట‌రైజేష‌న్ మీద సాంగ్ వుంది. ఈ పాట‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ  భాషల్లో కూడా విడుద‌ల చేశారు. తాజాగా వ‌దిలిన ఈ  పాట‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో మునిగి తెలుతున్నారు. 

Pushpa: The Rule First Single out:

Pushpa: The Rule First Single: Pushpa Pushpa lands like a true mass sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs