ప్రస్తుతం వేసవి సెలవలన్నీ వృధాగా పోతున్నాయి. రెండు నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి వలన పెద్ద సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చెయ్యలేదు. దానితో వేసవి తాపంతో థియేటర్స్ కి వెళ్లి సినిమాలు ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి వరసగా నిరాశేకనిపిస్తుంది. వారం వారం చిన్న సినిమాలు విడుదల కావడం.. ప్రేక్షకులు ఉసూరుమనడం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి.
అయితే జూన్ నుంచి పెద్ద సినిమాల హడావిడి మొదలు కాబోతుంది. అందులో ముందుగా శంకర్-కమల్ హాసన్ ల ఇండియన్ 2 జూన్ లో విడుదల అని ప్రకటించారు. జూన్ 13 న ఇండియన్ 2 డేట్ లాక్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. మే 16 న చెన్నై లో ఇండియన్ 2 ఆడియో వేడుకని సూపర్ స్టార్ రజిని, రామ్ చరణ్ లాంటి స్టార్స్ నడుమ నిర్వహించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.
ఇండియన్ 2 వచ్చిన రెండు వారాల గ్యాప్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి జూన్ 27 న విడుదలకి సిద్ధమైంది. రీసెంట్ గా కల్కి 2898 AD విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా కల్కి ప్రమోషన్స్ హడావిడి మొదలు పెట్టేసారు. నాగ్ అశ్విన్ కల్కిని వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఒక్క జూన్ లోనే కమల్ 13 న వస్తుంటే రెండు వారాల గ్యాప్ లో ప్రభాస్ అదే నెలలో 27 న రావడం ప్రేక్షకుల కి పండగే అని చెప్పాలి.