Advertisement
Google Ads BL

హరి హర వీరమల్లు నుంచి క్రిష్ అవుట్?


సడన్ గా హరి హర వీరమల్లు టీజర్ అప్ డేట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని తెగ సర్ ప్రైజ్ చేసిన వీరమల్లు మేకర్స్.. రేపు ఉదయం 9 గంటలకి హరి హర వీరమల్లు టీజర్ ఇవ్వబోతున్నట్టుగా పోస్టర్ తో ప్రకటించారు. ఏడాదిన్నర క్రితం ఆగిపోయిన హరి హర వీరమల్లు చిత్రం ఇన్నాళ్ళకి టీజర్ అప్ డేట్ తో న్యూస్ లో ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే హరి హర వీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడా? లేదంటే తప్పించారా? అనే అనుమానం అందరిలో కలిగేలా రీసెంట్ గా టీజర్ అప్ డేట్ పోస్టర్స్ సూచిస్తున్నాయి. నిన్న, ఈరోజు రెండు రోజుల నుంచి వదిలిన పోస్టర్స్ లో ఎక్కడా దర్శకుడిగా క్రిష్ పేరు కనిపించకపోయేసరికి అందరిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. 

పిరియాడికల్ డ్రామాగా క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ 70 శాతం పూర్తయ్యింది. ఈమద్యలో పవన్ పలు సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నప్పటికీ.. హరి హర వీరమల్లుని పక్కనపెట్టేశారు. క్రిష్ కామ్ గా ఈమధ్యనే అనుష్కతో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అయితే క్రిష్ తప్పుకున్నాడు అనడానికి పక్కా క్లారిటీ కూడా లేదు. 

ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వారు హరి హర వీరమల్లు డిజిటల్ హక్కులు దక్కించుకుని ఆ ఈవెంట్ కి పిలవగా క్రిష్ కూడా వెళ్ళాడు. కట్ చేస్తే ఇప్పుడు హరి హర వీరమల్లు టీజర్ అప్ డేట్ పోస్టర్స్ పై క్రిష్ పేరు లేదు అదే ఎవ్వరికి అర్ధం కావడం లేదు. 

Krish out of Hari Hara Veeramallu?:

Krish 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs