Advertisement
Google Ads BL

విశాల్ కి నిరాశ కంటిన్యూ..


కోలీవుడ్ హీరో విశాల్ గత కొంతకాలంగా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు, హీరోగా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో కయ్యానికి కాలు దువ్వుతూ కాంట్రవర్సీ హీరోగా మారిన విశాల్ ని విజయం పలకరించి చాలా ఏళ్ళు అవుతుంది. డిటెక్టీవ్, అభిమన్యుడు తర్వాత విశాల్ ఖాతాలో ఇంతవరకు హిట్ పడలేదు. 

Advertisement
CJ Advs

సింగం సీరీస్ తో టాప్ డైరెక్టర్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు హరితో రత్నం అంటూ రీసెంట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ కి ఈ చిత్రమూ నిరాశనే మిగిల్చింది. విశాల్-హ‌రిల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. అసలు రత్నం చిత్రానికి రిలీజ్ ముంగిట ఆశించిన హైప్ లేదు. 

అంతేకాకుండా సినిమా విడుదలయ్యాక తెలుగు, తమిళం రెండు చోట్లా ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌డ‌బ‌డుతోంది. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. కనీసం తమిళనాట అయినా రత్నం వర్కౌట్ అవ్వుద్ది అనుకుంటే అక్కడ విజయ్ పాత చిత్రం గిల్లి దెబ్బకొట్టింది. తెలుగులో విశాల్ ఒకటి రెండు ప్రెస్ మీట్స్ పెట్టి సినిమాలు విడుదల చేస్తున్నాడు. 

డిటెక్టివ్, అభిమాన్యుడు చిత్రాల హిట్ తో తెలుగులో మర్కెట్ పెంచుకున్న విశాల్.. వరస వైఫల్యాలతో అసలు తన లేటెస్ట్ చిత్రం రత్నం కి ఎలాంటి బజ్ క్రియేట్ చెయ్యలేకపోయాడు. దానితో అతని నిరాశ రత్నంతో కంటిన్యూ అవుతుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Click Here: Rathnam Review Cinejosh Rating 1/5 

Disappointment continues for Vishal..:

Vishal fans disappointed due to Rathnam result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs