Advertisement
Google Ads BL

కల్కి లో కమల్ పాత్రపై క్రేజీ న్యూస్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD చిత్రం జూన్ 27 న విడుదలకి సిద్దమవుతుంది. తాజాగా కల్కి మేకర్స్ చిన్నపాటి సర్ ప్రైజ్ అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ కూడా ఇవ్వండి ఇవ్వండి మాకు సర్ ప్రైజ్ లంటే ఇష్టమంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. కమల్ హాసన్ కల్కి చిత్రంలో నేను అతిధి పాత్రలో కనిపిస్తానని చేప్పి కాస్త డిస్పాయింట్ చేసారు. 

Advertisement
CJ Advs

ఆయన గెస్ట్ రోల్ ప్లే చేసినా ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ కల్కి రోల్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. క‌మ‌ల్ పాత్ర పురాణాల్లోని కృష్ణుడి మేనమావ కంశుడి కేరెక్టర్ కి పోలి ఉంటుంద‌ని స‌మాచారం. క‌మ‌ల్ పాత్రని నాగ్ అశ్విన్ కంశుడిని రిఫ‌రెన్స్‌గా తీసుకొని డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. 

ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో ఉంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకొన్న క్యారెక్ట‌ర్‌లో క‌మ‌ల్ హాసన్ కల్కిలో క‌నిపించ‌నున్నార‌ని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇదే నిజమంటున్నారు. త్వరలోనే కమల్ కేరెక్టర్ కి సంబందించిన కల్కి గ్లిమ్ప్స్ వదలబోతున్నారట మేకర్స్. ప్రభాస్ భైరవగా కనిపించబోతున్న ఈ చిత్రంలో అమితాబ్ అలాగే దీపికా పదుకొనె, దిశా పఠానీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Crazy news about Kamal role in Kalki:

Is Kamal Character In Kalki 2898 AD Inspired By Kamsa?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs