మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి భారీ విరాళమివ్వడమే కాకుండా ఇప్పుడు పిఠాపురం వెళ్లి తమ్ముడు గెలుపు కోసం రోడ్ షో చేస్తారనే విషయం విన్న తర్వాత వైసీపీ కి మింగుడు పడడం లేదు. అంతేకాదు తన అభిమాని ఘంటా శ్రీనివాసరావు కి సీఎం రమేష్ కి చిరు మద్దతు నివ్వడంతో పాటుగా టీడీపీ-జనసేన-బిజెపి కూటమికి కాస్త ఫేవర్ గా కనిపించడం కూడా వైసీపీ బ్లూ మీడియా జీర్ణించుకోలేకపోతుంది.
దానితో మెగాస్టార్ మీరు చేస్తున్నది తప్పు, కన్నబాబు ని పట్టించుకోవడం లేదు, వైసీపీ అభ్యర్థి కన్నబాబు మీ అభిమాని. ఆయన గెలుపు కోసం మీరు ఏదో విధంగా సాయం చెయ్యాల్సింది. పవన్ కళ్యాణ్ పదే పదే కన్నబాబుని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కి అన్న గా చిరు చెప్పాలి కదా. ట్వీట్ చెయ్యడం అక్కడు, బహిరంగంగానే చెప్పాలి కన్నబాబు ని వదిలెయ్యమని. తన తరపున ఎవరైనా ఎగబడితే అది తప్పని చిరు మొదటి నుంచి చెప్పరు అంటూ బ్లూ మీడియాలో మెగాస్టార్ పై తన అక్కసుని వెళ్లగక్కుతుంది.
మెగాస్టార్ అంటే ఒక హోదా, పెద్దరికం. అది ఆయనకి ఆయనే తగ్గించేసుకుంటున్నారు, ఒక్కసారి సినిమాలు తగ్గించేసుకున్న తర్వాత ఆ తప్పు ఆయనకి అర్ధమవుతుంది. ఒకవేళ మళ్ళీ వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తే.. అప్పుడు చిరు జగన్ వద్దకి వెళ్లి మళ్ళీ ఎలా దగ్గరవుతారో చూద్దామంటూ మెగాస్టార్ చిరుని బెదించేస్తుంది బ్లూ మీడియా.