శ్రీలీల షూటింగ్స్ లో మాత్రమే కనిపించడం లేదు, సోషల్ మీడియాలో పాప చాలా యాక్టీవ్ ఉంటుంది. కొత్త కొత్త డ్రెస్సులతో చూపు తిప్పుకోలేని అందంతో తరచూ దర్శనమిస్తుంది. వరస పరాజయాలు పలకరించడంతో ప్రస్తుతం కామ్ గా ఉన్న శ్రీలీల కి ఈ మద్యన తమిళనాట అదిరిపోయే ఆఫర్ వచ్చింది అనే ప్రచారం జరిగింది.
అజిత్ సరసన శ్రీలీలకి ఛాన్స్ వచ్చింది అన్నారు. ఈలోపులో హీరో విజయ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో శ్రీలీలకి అవకాశం రాగా ఆమె దానిని సున్నితంగా తిరస్కరించింది అనే ప్రచారమూ జరిగింది. అయితే శ్రీలీల ఇపుడు చాలా అందంగా పింక్ కాస్ట్యూమ్ లో కనిపించి కనువిందు చేసింది.
పింక్ కాస్ట్యూమ్ లో శ్రీలీల అందాలని వర్ణించ తరమా అన్న విధంగా క్యూట్ అండ్ స్వీట్ గా కనిపించింది. అది చూసిన ఆమె అభిమానులు పింక్ బ్యూటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మీరు శ్రీలీల పింక్ అందాలను ఓ లుక్కెయ్యండి.