పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్తా జనసేన పవన్ కళ్యాణ్ పాత్ర పోషిస్తూ ఏపీ రాజకీయాల్లో చమటలు కక్కుతున్నారు. మే 13 న జరగబోయే ఎన్నికల కోసం కూటమి(టీడీపీ-బీజేపీ) తో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు ఏసిలో కనబడే ఈ హీరో ఇప్పుడు వేసవి తాపాన్ని, వడగాలులని తట్టుకుంటూ ప్రజల్లో తిరుగుతూ జనసేనాని కష్టపడుతున్నారు
అయితే ఎన్నికలక కోసం ఆయన నటిస్తున్న సినిమాలకి తాత్కాలిక బ్రేకిచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముగిసి రిజల్ట్ రాగానే మళ్ళీ తన సినిమా షూటింగ్స్ లో బిజీగా మారుతారు. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా సుజిత్ దర్శకత్వంలో OG షూటింగ్స్ లో పాల్గొంటారు. ఇప్పటికే OG షూటింగ్ చాలావరకు పూర్తవడంతో మేకర్స్ డేట్ కూడా లాక్ చేసి ప్రకటించారు.
సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్-సుజిత్ OG విడుదల కాబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో అభిమానులని బాగా ఇంప్రెస్స్ చేసారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చెయ్యబోతున్నారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 27 నుంచి OG డేట్ మారొచ్చనే ఊహాగానాలు మొదలు పెట్టారు.
ఒకవేళ అనుకున్న సమయానికే ఓజి సినిమా షూట్ పూర్తి చేసుకున్నా కూడా.. ఓటిటి డీల్ పూర్తి కానీ కారణంగా OG ఈ ఏడాది వస్తుందా అన్న అనుమానాలు వున్నాయి.. అంటూ కొంతమంది చేసిన ట్వీట్స్ చూసి పవన్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.