క్యూట్ అండ్ స్వీట్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ బాట పట్టింది. మహానటి తర్వాత సక్సెస్ కోసం అల్లాడిన కీర్తి సురేష్.. ఇకపై గ్లామర్ రోల్స్ కి సై అంటుంది. కేవలం గ్లామర్ కేరెక్టర్స్ కే కాదు.. ఆమె పబ్లిక్ ఈవెంట్స్ లోను గ్లామర్ అవుట్ ఫిట్స్ లో అదరగొట్టేస్తుంది. తాజాగా వరుణ్ ధావన్ బేబీ చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది కీర్తి సురేష్.
మరి ముంబై గాలి తగిలితే హీరోయిన్స్ ఎలా మారిపోతారో చాలామంది సౌత్ భామలని చూసినట్టుగానే.. కీర్తి సురేష్ కూడా గ్లామర్ గేట్స్ తెరిచింది. వరుణ్ ధావన్ బర్త్ డే పార్టీ వీడియోలో కీర్తి సురేష్ ని చూస్తే ముంబై గాలి బాగా వంటబట్టింది అంటారు. అసలు కీర్తి సురేష్ కనబడిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
అదాల ఉంటే కీర్తి సురేష్ పోయిన వీకెండ్ ని తన ఫ్రెండ్స్ అలాగే పెంపుడు కుక్క నైక్ తో కలిసి పాండిచేరి లో చిల్ అవుతూ కనిపించింది. About last night ✨ అంటూ గ్లామర్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. వేసవి లో కీర్తి సురేష్ కూల్ గా ఫ్రెండ్స్ తో రిలాక్స్ అవుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.