ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు-2024 అధికార వైసీపీ.. కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీకి డూ ఆర్ డైగా మారాయి. వైసీపీ గెలిస్తే హిస్టరీ.. టీడీపీ ఓడితే పార్టీ కనుమరుగే అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అందరికంటే ముందుగా.. సూపర్ సిక్స్ అంటూ కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన హామీల్లో నుంచి కాపీ కొట్టిన టీడీపీ.. ఇప్పుడు వైఎస్ జగన్ మేనిఫెస్టో ప్రకటించడంతో ఇరకాటంలో పడ్డారు. చేసిందే చెబుతాం.. చెప్పిందే చేస్తాం ఇదే నినాదంతో నవరత్నాలు 2.0గా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. చంద్రబాబును ఏకిపారేస్తూ 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి..? నెరవేర్చినవేంటి..? 2019 ఎన్నికల్లో తాను ప్రకటించిన మేనిఫెస్టో ఏంటి..? అమలు చేసిందేమిటి..? ఇక అభివృద్ధి, కంపెనీలు, పోర్టులు, ఉద్యోగాలు ఇలా ఏ ఒక్కటీ వదలకుండా లెక్కలేసి మరీ చెప్పారు జగన్. నమ్మకం-నమ్మకద్రోహం మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ వైసీపీ జనాల్లోకి దూసుకెళ్తోంది. ఇక మేనిఫెస్టో ప్రకటించిన మరుసటి రోజు నుంచే జగన్ మరో జైత్రయాత్రను షురూ చేయగా ఎటు చూసినా కనుచూపు మేరలో జనమే.. ఇసుకేస్తే రాలనంతగా.. ఏ ప్రాంతానికి వెళ్లినా అదంతా జనసంద్రంగానే మారుతోంది. అంటే.. జగన్ మేనిఫెస్టోపై ఇసుమంత కూడా జనాల్లో వ్యతిరేకత లేదనేది తేలిపోయింది.
ఇప్పుడంతా ఇదే చర్చ!
వైఎస్ జగన్ చెప్పాల్సింది చెప్పేశారు.. చెప్పింది ఎంత కష్టమైనా అమలు చేస్తానని, మాట తప్పను.. మడమ తిప్పనని క్లియర్ కట్‌గా చెప్పారు. జగన్ మేనిఫెస్టో సరే.. చంద్రబాబు సంగతేంటి..? సూపర్ సిక్స్ సాధ్యమేనా..? ఇందులో అమలు చేసేవి.. అలివిగానివి ఏవి..? అనే బేరీజు చేసే పనిలో పడ్డారు జనాలు, నిపుణులు, మేథావులు. అంటే.. జగన్ మేనిఫెస్టో వర్సెస్ సూపర్ సిక్స్ అన్న మాట. మేథావులు ఏం చెబుతున్నారు..? రాజకీయ విశ్లేషకుల నోట ఏం వినిపిస్తోందనే విషయాలు లెక్కల్లో తెలుసుకుందాం రండి.
ఆంధ్రప్రదేశ్ జనాభా : 5.3 కోట్లు
పురుషులు : 4.24కోట్లు (ఓటర్లు-2.01 కోట్లు)
మహిళలు : 4.21 కోట్లు (ఓటర్లు-2.07 కోట్లు)
మొత్తం ఇళ్ళు: 2.21 కోట్లు
1. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు :-
ఏపీలో మొత్తం ఇళ్ళు : 2.21 కోట్లు
ఖర్చు : 6,650 కోట్లు(రీఫీల్ చేస్తే)
ఒక వేళ కొత్త సిలిండర్లు కొని ఇస్తే మొదటి సంవంత్సరం ఖర్చు : 19,980 + 6,650 కోట్లు.
2. 18 సంవంత్సరాలు నిండిన మహిళకి నెలకు రూ. 1,500 :-
రాష్ట్రంలో 18 సంవంత్సరాలు నిండిన మహిళలు : 2.1 కోట్లు
నెలకి ఖర్చు : రూ. 3,150 కోట్లు
సంవంత్సరానికి : రూ. 37,800 కోట్లు.
3. పెన్షన్.. రూ. 4,000 :-
ఇప్పుడున్న పెన్షన్ దారులు : 64 లక్షలు
నెల ఖర్చు: రూ. 2,560 కోట్లు
సంవంత్సరానికి : రూ. 30,720 కోట్లు.
4. ప్రతి విద్యార్థికి 15,000
ప్రస్తుతం స్కూల్ విద్యార్థులు : 71 లక్షలు
సంవంత్సరానికి ఖర్చు : రూ. 1.650 లక్షల కోట్లు.
5. ప్రతి రైతుకి రూ. 20,000 :-
రాష్ట్రంలో ఉన్న రైతులు : 7.4 లక్షలు
సంవంత్సరానికి ఖర్చు : రూ. 14,800 కోట్లు
6. నిరుద్యోగ భృతి :-
నెలకు : రూ. 4000 కోట్లు
సంవంత్సరానికి : రూ. 48,000 కోట్లు
7. ఉచిత బస్సు :-
సంవంత్సరానికి ఖర్చు : రూ. 4,500 కోట్లు
మొత్తం ఖర్చు :-
19980+6650+37800+30720+165000+14,800+48000+4,500= 3,27,450 కోట్లు.
ఇవి కాకుండా కాపిటల్ ఎక్సపెండేచర్ : రూ. 74,000 కోట్లు
(జీతాలు+కార్యాలయాల నిర్వహణ +ప్రభుత్వం రోజు వారి ఖర్చులు లాంటివి)
రెండూ కలిపితే.. మొత్తం ఖర్చు : రూ. 4,01,450 కోట్లు
2024-2025 మన రాష్ట్రం బడ్జెట్ : రూ. 2.86 లక్షల కోట్లు
4,01,450-2,86,000= రూ. 1,15,450 కోట్లు
అంటే చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఏడాదికి రూ. 1.15 లక్షల కోట్లు అప్పు చెయ్యాలన్న మాట. ఇప్పుడు చెప్పండి.. ఈ పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు చేయడం సీబీఎన్‌కు సాధ్యమేనా..? అని ప్రజలు, నెట్టింట్లో చదువుకున్న కుర్రాళ్లు చర్చించుకుంటున్న పరిస్థితి. పోనీ 2014 ఎన్నికల్లో ఎన్ని హామీలిచ్చారనే సంగతి పక్కనెడితే.. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఎంతమేరకు హామీలు అమలు చేశారన్నది కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఫైనల్‌గా జగన్‌ను జనం నమ్ముతారో.. చంద్రబాబునే గెలిపించి సీఎం చేస్తారో చూడాలి మరి. మే-13న ఓటు ఎలా పడుతుంది..? జూన్-04 ఫలితం ఎలా వస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి.