గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలు హడావిడి తప్ప పెద్ద సినిమాలేవీ బాక్సాఫీసు వద్దకి రావడం లేదు. స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ ఇలా ప్రతి స్టార్ హీరో చిత్రాలు జూన్ నుంచి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ఎఫెక్ట్ తో ప్రస్తుతం చిన్న సినిమాల జాతర కనబడుతుంది. ఎప్పటిలాగే ఈవారం కూడా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు, సుహాస్ ప్రసన్నవదనం, వరలక్ష్మి శరత్ కుమార్ శబరి, సుందర్ సి బాక్ చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
ఇక వారం వారం ఓటీటీలలో కొత్త చిత్రాల స్ట్రీమింగ్స్, కొత్త కొత్త వెబ్ సీరీస్ ల విడుదలతో ఈ వారమూ ముస్తాబైంది. ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి.
ఈ వారం ఓటీటీ చిత్రాలు, వెబ్ సీరీస్ ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్ :
బాయిలింగ్ పాయింట్ 1 (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 29
ఫియాస్కో (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30
హీరామండి (వెబ్ సిరీస్) - మే 1
షైతాన్ - మే 3
అమెజాన్ ప్రైమ్ వీడియో:
అంబర్ గర్ల్స్ స్కూల్ (వెబ్ సిరీస్) - మే 1
ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 2
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - మే 3
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ది వీల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30
మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు వర్షన్) - మే 5
మాన్ స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - మే 5