కల్కి 2898 AD చిత్రాన్ని జూన్ 27 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కల్కి రిలీజ్ కి ఇంకా రెండు నెలలు సమయం ఉన్నప్పటికీ.. నాగ్ అశ్విన్ ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 AD ప్రమోషన్స్ ని మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మే లో కల్కి నుంచి సాంగ్ వచ్చే అవకాశం ఉంది అంటుంటే.. మేకర్స్ కల్కి ప్రమోషన్స్ ని వరల్డ్ వైడ్ గా చేపడుతున్నారట.
అయితే కల్కి హీరోయిన్ దీపికా పదుకొనె ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కల్కి ప్రమోషన్స్ కి హాజరవుతుందా అనేది ఇప్పడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. దీపికా పదుకొనే లేకుండా కల్కి టీం ఎలా మ్యానేజ్ చేస్తుందో అనేది కూడా అందరిలో మొదలైన సందేహం. లేదంటే దీపికా పదుకొనే కల్కి ప్రమోషన్స్ కి వస్తుందా.. హెల్దీగా ఉంటె వచ్చినా రావొచ్చు.
మరి వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ లో హీరోయిన్స్ కూడా భాగమైతే కల్కి పై ఇంప్రెషన్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. గతంలో అలియా కూడా బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో ప్రెగ్నెంట్ తోనే పాల్గొంది. కల్కి జూన్ 27 న భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.