Advertisement
Google Ads BL

ఎక్కడ చూసినా మాధవి లతే


ప్రస్తుతం తెలంగాణ అందునా హైదరాబాద్ సిటీలో మార్మోగిపోతున్న పేరు మాధవి లత. బిజెపి నుంచి ఎంపీ గా పోటీచేస్తున్న మాధవి లత పేరు మోసిన విరంచి హాస్పిటల్ చైర్ పర్సన్. ఆమె ఆసుపత్రిలో రోగులకు ఎంతసహాయం చేసిందో తెలియదు కానీ.. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె దూకుడు మామూలుగా లేదు. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ పేర్లు బీజేపీ లో ప్రముఖంగా వినిపించినా.. ఇప్పుడు వాళ్ళ పేర్లు పక్కకి పోయి ప్రస్తుతం మాధవి లత పేరు వినిపిస్తోంది. ఆమె ప్రచారంలో భాగంగా చేస్తున్న విన్యాసాలు, ఎదుటి వారి మాటలకి జవాబిచ్చే తీరు అన్ని ప్రజలని ఆకర్షిస్తుండగా.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ విన్నా ఆమె పేరే వినబడుతుంది. ఒకవేళ మాధవి లత గెలిస్తే ఆమెకి మోడీ కేబినెట్ లో మినిస్టర్ పదవి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మోడీ కూడా మాధవి లతని పొగిడేస్తున్నారు. గతంలో రేణుక చౌదరి గురించి ఇలానే మాట్లాడుకునేవారు. లేడీ ఫైర్ బ్రాండ్ అంటూ. ఆమె అంత కాకపోయినా మాధవి లత కూడా తన మార్క్ రాజకీయాలు చూపించడంలో అడుగడుగునా సక్సెస్ అవుతుంది. 

మాధవి లత దూకుడు చూసిన అందరూ కిషన్ రెడ్డి పోస్ట్ కి మాధవి లత ఎసరు పెట్టేలా ఉంది అంటున్నారు. మరోపక్క ఏంటండీ ఈవిడ అట్టా దూసుకుపోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

BJP Hyderabad candidate Madhavi Latha :

PM Modi heaps praise on Madhavi Latha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs