Advertisement
Google Ads BL

నీతోనే డాన్స్: నేహా చౌదరికి ఏమైంది


శ్రీముఖి యాంకర్ గా సీనియర్ హీరోయిన్ రాధా, తరుణ్ మాస్టర్, సదా జెడ్జెస్ గా నీతోనే డాన్స్ అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మొదలు పెట్టిన డాన్స్ షో సూపర్ సక్సెస్ అవడంతో మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీరియల్ యక్టర్స్ తో నీతోనే సీజన్ 2 ని మొదలు పెట్టారు. శ్రీముఖి సరదా సరదా యాంకరింగ్, అలాగే సీరియల్ స్టార్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అదిరిపోయే డాన్స్ స్టెప్స్, జెడ్జెస్ జోక్స్ తో ఈ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 

Advertisement
CJ Advs

అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నయని పావని అనారోగ్య కారణాలతో తప్పుకోగా.. యావర్ కి జోడిగా వాసంతి వచ్చింది. వారిద్దరి పెయిర్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి విశ్వ కో జోడిగా వస్తున్న నేహా చౌదరి మెడ కి పెద్ద బ్యాండ్ ఎయిడ్ వేయించుకుని స్టేజ్ పై కనిపించింది. తాను ఇలాంటి పరిస్థితిలో స్టేజ్ పైకి వస్తాను అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమె అభిమానులు నేహా చౌదరికి ఏమైందో అనే ఆందోళనలోకి వెళ్లి ఆమెని ప్రశ్నిస్తున్నారు. ఏమైంది, ఎందుకు మీరు నీతోనే డ్యాన్స్ షో చేయట్లేదని అడుగున్నారు. 

దానితో నేహా తాను ఈ షో ఎందుకు చేయట్లేదో చెప్పుకొచ్చింది. డ్యాన్స్ షో ప్రాక్టీస్ చేస్తుండగా చాలా సార్లు తనకు చాలా దెబ్బలు తగిలాయని, ఆ గాయాల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కున్నట్లు చెప్పిన నేహా చౌదరి చాలా రోజులుగా తనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అసలు పని చేయట్లేదని.. అంతేకాకుండా నొప్పి విపరీతంగా ఉందని చెప్పుకొచ్చింది. 

తాను ఇబ్బంది పడుతున్న విషయం గుర్తించిన తన పార్ట్నర్ విశ్వ నువ్వు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాలని పట్టు పట్టుబట్టడంతో ఆసుపత్రికి వెళ్లిన తనకు చేయి అంతా దెబ్బ తిన్నట్లు డాక్టర్స్ చెప్పడంతో షాకయ్యను. ఆరు వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. అలాగే మెడలు ఎటూ తిప్పకూడదని చెప్పడంతో తాను డాన్స్ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లుగా చెప్పింది. 

నేహా చౌదరి తప్పుకోవడంతో విశ్వ కి జోడిగా నయని పావని ఈ షోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆరోగ్యం కుదుట పడడంతో నయని విశ్వకి జోడిగా నీతోనే సీన్ 2 కి వస్తుంది. 

Neha Revealed Why She Leaves Dance Show:

Neha Chowdary Revealed Why She Leaves Neethone 3 Dance Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs