Advertisement
Google Ads BL

మరోసారి నా సామిరంగా కాంబినేషన్


కింగ్ నాగార్జున ప్రస్తుతం సోలో గా సినిమాలు చెయ్యడం కంటే మల్టిస్టార్సర్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ - శేఖర్ కమ్ముల కుబేర చిత్రంలో కీలక పాత్రలో(నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా)కనిపించబోతున్న నాగార్జున.. సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలి చిత్రంలో కూడా నటించబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. 

Advertisement
CJ Advs

అదలా ఉంటే ఈఏడాది సంక్రాంతికి కొత్త దర్శకుడు విజయ్ బిన్నీని పరిచయం చేస్తూ నా సామిరంగా చేసి హిట్ కొట్టిన నాగార్జున.. మరోసారి విజయ్ బిన్నీ దర్శకత్వంలోనే సినిమాని ఒప్పుకోబోతున్నారనే న్యూస్ వినిపిస్తోంది.  నాగార్జున ప్రస్తుతం తన దగ్గరకి వచ్చే కథలు వింటున్నా.. తన తదుపరి చిత్రం కోసం చాలా ఆలోచిస్తున్నారట. అంటే ఏ జోనర్ లో అయితే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అనేది నాగ్ ఆలోచనట. 

విజయ్ బిన్నీ నా సామిరంగ అంటూ కుటుంబ ప్రేక్షకులకి దగ్గరయ్యే చిత్రంతో వచ్చి విజయం సాధించడంతో.. మరోసారి విజయ్ బిన్నీ కథ నాగర్జునకి కూడా నచ్చడంతో అతనితోనే తన తదుపరి చిత్రాన్ని చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. మరి ఈ కాంబో అధికారికంగా ప్రకటిస్తేనే కానీ అసలు విషయంలో స్పష్టత రాదు. 

Naa Saami Ranga combo on Cards:

Once again Naa Saami Ranga combination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs