Advertisement
Google Ads BL

పవన్ కోసం చిరు రాకపై సందిగ్దత


పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చిరు పరోక్షం గా కాదు.. ప్రత్యక్షంగానే మద్దతునిచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఆయన ఐదు కోట్ల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరు విరళంతోనే ఆపేస్తారా లేదంటే తమ్ముడు కోసం గ్రౌండ్ లోకి దిగి పిఠాపురంలో ప్రచారం చేస్తారా అనే విషయంలో చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

చిరంజీవి మే 5 న పిఠాపురం వెళ్లి తమ్ముడు కోసం రోడ్ షో నిర్వహిస్తారని, ప్రజల్లో తిరుగుతూ పవన్ కి ఓటెయ్యమని, జనసేనాని గెలిపించమని అడుగుతారని ప్రచారం జరుగుతుంది, మరోపక్క చరణ్ కూడా చిరు తో జాయిన్ అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా నాగబాబు చిరు పిఠాపురం రాకపై క్లారిటీ ఇచ్చారు. 

ఇప్పటికే వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తుండగా.. తర్వాత సాయి ధరమ్, వైష్ణవ తేజ్ వస్తారు కానీ.. అన్నయ్య చిరు వస్తారో లేదో ఇంకా తెలీయదని తెలిపారు. ప్రస్తుతం అన్నయ్య విశ్వంభర షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.. అంటూ చెప్పడం చూస్తే.. చిరు విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు, అక్కడ బిజీగా వున్న కారణంగా ఆయన పిఠాపురం రాకపోవచ్చనే సంకేతాలు నాగబాబు అందించారని అంటున్నారు.  

Doubt over Chiru arrival for Pawan:

Nagababu about Megastar Chiru roadshow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs