నిన్న శనివారం ప్రభాస్ ఫాన్స్ ని కూల్ చేస్తూ కల్కి 2898 AD రిలీజ్ డేట్ లాక్ చేసి కొత్త పోస్టర్ తో సహా ప్రకటించారు. జూన్ 27 న కల్కి వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. దానితో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్న సమయంలో ఇప్పుడు గట్టి షాక్ తగలబోతోంది అనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ చూస్తే తెలుస్తోంది.
అదేమిటంటే ఈ నెలలో మొదలవుతుంది అని అనుకున్న సలార్ పార్ట్ 2 షూటింగ్ మే రెండో వారంలో మొదలయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్, బాబీ సింహా అందరూ సలార్ పార్ట్ 2 షూటింగ్ పై క్రేజీ క్రేజీ అప్ డేట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నారంటున్నారు. అంటే సలార్ 2 ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి ప్రస్తుతం NTR 31 పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే ఎన్టీఆర్ పుట్టిన రోజుకి NTR 31 ఫస్ట్ లుక్ కూడా ఇచ్చారు.
ఇప్పుడు ఎన్టీఆర్ దేవర పూర్తి చేసి వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాని లైన్ లో పెట్టాలని చూస్తున్నారట. ఎన్టీఆర్ ఎలాగూ మధ్యలో వార్ 2 షూటింగ్ చేసుకుంటూ అలాగే ప్రశాంత్ నీల్ తో NTR 31 సెట్స్ లో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడంతో ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కి బ్రేకివ్వాలనుకుంటున్నాడనే న్యూస్ ప్రభాస్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూసే కదా..!