Advertisement
Google Ads BL

పవన్ కోసం కదులుతున్న చిరు-చరణ్


ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి వేసవి తాపాన్ని మరింతగా పెంచేస్తుంది. రాజకీయ పార్టీల మధ్యన ఎన్నికల హీట్ అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మే 13 ఎలక్షన్స్ జరిగే వరకు రాజకీయ నాయకులంతా ప్రజల మధ్యలో పోరాటం చేయాల్సిందే. ఇక జనసేన పవన్ కళ్యాణ్‌కి ఆయన సినీ గ్లామర్‌తో పాటుగా తన ఫ్యామిలీ మద్దతు కూడా తోడవుతోంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే పవన్‌కి మద్దతుగా వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ రోడ్ షో పిఠాపురం ప్రజల మధ్యన కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి తోడుగా అన్న మెగాస్టార్ దిగుతున్నారనే టాక్ ఉంది. మెగాస్టార్ చిరు మే 5న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న జనసేన తరపున ప్రచారం చేస్తారని చెబుతున్నారు. 

కేవలం చిరునే కాదు.. బాబాయ్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా దిగబోతున్నాడట. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మే 5న పిఠాపురం వచ్చి గొల్లప్రోలు, పిఠాపురం టౌన్‌లలో రోడ్డు షో నిర్వహిస్తారు అంటూ సోషల్ మీడియాలో వైరలవుతోన్న పోస్ట్‌లు చూసి మెగా, జనసేన అభిమానులతో పాటుగా జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా ఎగ్జైట్ అవుతున్నారనేలా పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

Not Only Chiru Charan Also Campaign for Pawan Kalyan:

Chiranjeevi and Ram Charan For Pawan Kalyan Janasena
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs