Advertisement
Google Ads BL

గ్లాస్‌తో గ్లామర్ ఒలకబోస్తూ.. శ్వేతా బసు


శ్వేతా బసు ప్రసాద్.. ఒకప్పుడు కుర్రకారుకి నిద్రలేకుండా చేసిన హీరోయిన్. వరుణ్ సందేశ్ సరసన చేసిన కొత్త బంగారు లోకం చిత్రంతో ఒక్కసారిగా కుర్రాళ్ల కలల హీరోయిన్‌గా మారిన ఈ భామ..  ఆ తర్వాత ఎ క డ.. అని వెతుక్కునేలా మారిపోయిందంటే.. అందుకు కారణం ఆమె స్వయంకృతాపరాధమే. సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరున్నప్పుడే ఈ భామ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకుని.. అందుకు ఎన్నుకున్న మార్గమే ఆమెని ఇండస్ట్రీకి దూరం చేసింది. చేతులకు బేడీలు పడే వరకు తీసుకెళ్లింది. ఆ కథంతా ఇప్పుడెందుకులే గానీ.. అసలు విషయం గురించి చెప్పుకుందాం. 

Advertisement
CJ Advs

శ్వేతా బసు ప్రసాద్.. ఓ పెద్ద కోణం నుండి బయటపడి.. ఎట్టకేలకు ఒకర్ని పెళ్లాడింది. రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో కొంతకాలం ప్రేమాయణం నడిపిన ఈ భామ.. ఆ తర్వాత అతన్నే పెళ్లాడింది. కానీ ఆ పెళ్లి బంధం ఎంతోకాలం నిలవలేదు. ప్రస్తుతం ఆమె రోహిత్ నుండి విడిపోయిందనేలా వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే ఆమె హాట్ హాట్ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో వదిలి.. దర్శకనిర్మాతల కళ్లల్లో పడేలా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో షాకింగ్ లుక్‌లో శ్వేతా బసు కనిపించింది. నిజంగా అసలు ఆ ఫొటోల్లో ఉంది శ్వేతా బసునా అనేంత ఆశ్చర్యపరుస్తోంది. స్లిమ్‌గా తయారై.. గ్లాస్ పట్టుకుని గ్లామర్ ఒలకబోస్తోన్న శ్వేతా బసు ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి ఈ ఫొటోలను చూసి.. ఆమెకు మళ్లీ ఎవరు ఛాన్సిస్తారో చూడాలి.  

Shweta Basu Prasad Glamour Photos Goes Viral:

Shweta Basu Prasad Ready to Re Entry 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs