Advertisement
Google Ads BL

ఫైనల్లీ.. మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ డేట్


ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని పలువురు పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేయగా.. ఆ చిత్రం విడుదలైన ప్రతి భాషలోనూ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే బలంగా ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా మలయాళంలో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం మిగతా భాషల్లోనూ అదే స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేయడం విశేషం.

Advertisement
CJ Advs

ఇంకా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోన్న ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కించుకున్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి తీసుకు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. నిన్నమొన్నటివరకు మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ డేట్ పై దోబూచులాడింది డిస్ని ప్లస్ హాట్ స్టార్. ఇప్పుడు ఫైనల్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని డిస్ని ప్లస్ హాట్ స్టార్  లాక్ చేసి.. అధికారికంగా ప్రకటించింది.

మే 5 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో మంజుమ్మల్ బాయ్స్ మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌లోకి తేబోతున్నట్టుగా అధికారికంగా పోస్టర్ వేసి మరీ గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో ఇప్పటి వరకు మంజుమ్మల్ బాయ్స్‌ ఓటీటీ విడుదలపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. మే 5 నుంచి ఈ సినిమాలో ఇంట్లోనే ఫ్యామిలీతో వీక్షించవచ్చు.

Manjummel Boys OTT Release Date Locked:

Manjummel Boys in Disney Plus Hotstar From May 5th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs