యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‌తో పాటుగా హిందీకి గ్రాండ్‌గా లాంచ్ అవుతున్న వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళుతూ తన పనిలో తాను బిజీగా వుంటున్నారు. దేవర షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ అనుకుంటుంటే.. మళ్ళీ ఎన్టీఆర్‌ని కొంతమంది రాజకీయాల్లోకి లాగుతున్నారు.
గతంలో ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్‌గా ఎలక్షన్స్ సమయంలో ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. గత ఐదేళ్ళలో ఎన్టీఆర్ రాజకీయాలపై ఎటువంటి కామెంట్స్ చెయ్యకపోయినా.. కొంతమంది కావాలనే ఎన్టీఆర్‌ని ఈ బురదలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీలో ఎలక్షన్స్ హీట్ పెరిగిపోతుంది.
ఈ సమయంలో ఎన్టీఆర్ ఎవ్వరి వాడు.. టీడీపీలోకి వెళ్ళి మావయ్య చంద్రబాబు, బాబాయ్ బాలయ్యలని బలపరుస్తాడా.. లేదంటే వైసిపిలో పోటీ చేస్తున్న స్నేహితులు కొడాలి నాని, వంశీలకి సపోర్ట్ చేస్తాడా.. అసలు ఎన్టీఆర్ ఎటువైపు నిలబడతాడు అని అప్పుడే బులుగు మీడియా సెటైర్స్ మొదలు పెట్టింది. అసలు ఎన్టీఆర్ తన పని తాను చూసుకుంటూ రాజకీయాలకి దూరంగా ఉంటున్న సమయంలో ఇలాంటివి రాస్తూ కెలకడం అవసరమా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఫైరవుతున్నారు. అందులోనూ ఎన్టీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడినా.. దానిని ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా తీసుకుని.. లేనిపోని రాతలు రాసేస్తున్నారు. ఇవన్నీ గమనించే.. ఎన్టీఆర్ రాజకీయాలకు రాం రాం అనేశారు.