Advertisement
Google Ads BL

పుష్ప కేశవ రోల్‌పై సుక్కు కామెంట్స్


పుష్ప సినిమాను నడిపించే పాత్ర కేశవ. అసలేం జరిగిందో.. ఎట్టా జరిగిందో.. కేశవ పాత్ర చెబుతుంటే పుష్ప సినిమా నడుస్తుంది. ఆ పాత్రకి జగదీశ్ పర్ఫెక్ట్‌గా సెట్టయ్యాడు. ఆ సినిమా తర్వాత జగదీశ్ కంటే కూడా కేశవ అంటేనే తెలిసే విధంగా ఆ పాత్ర అతనికి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే జగదీశ్ ఈ మధ్య ఓ అమ్మాయి విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ ఆలస్యానికి కారణమైన వాటిలో జగదీశ్ అరెస్ట్ కూడా ఒకటి. జగదీశ్‌ని బెయిల్‌పై తీసుకువచ్చి.. షూటింగ్ చేస్తున్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేశవ పాత్రపై సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

శుక్రవారం రాత్రి జరిగిన ప్రసన్నవదనం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసన్నవదనం సినిమాలో ఈ మధ్య వరుస హిట్స్‌తో దూసుకెళుతోన్న సుహాస్ హీరో. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో సుహాస్‌ను ఉద్దేశిస్తూ.. సుకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. విషయంలోకి వస్తే..

మొదట కేశవ పాత్రకు సుహాస్‌నే అనుకున్నారట. అల్లు అర్జున్ కూడా సుహాస్ అయితే బాగుంటాడని అన్నారట. కానీ అప్పటికే సుహాస్ హీరోగా చేస్తూ.. మంచి కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ టైమ్‌లో అతన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం తీసుకోవడం కరెక్ట్ కాదనిపించి.. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ జగదీశ్‌ని సెలక్ట్ చేశామని ఈ వేడుకలో సుక్కు చెప్పుకొచ్చారు. వాస్తవానికి జగదీశ్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు.. సుహాస్ అయినా కూడా ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేవాడే. అయినా కూడా ఒక నటుడు ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని సుక్కు, బన్నీ తీసుకున్న నిర్ణయానికి వారిద్దరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Sukumar Comments on Pushpa Keshava Role:

Suhas is the First Option for Pushpa Keshava Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs