Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ గ్లామర్ గేట్లు ఎత్తేసింది


కీర్తి సురేష్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహానటి. ఆ సినిమాతో కీర్తి ఇమేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఆమెకు లేడీ ఓరియంటెడ్ పాత్రలే ఎక్కువగా పలకరించాయి. పోనీ అవేమైనా హిట్టయ్యాయా? అంటే అదీ లేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మమ మహేషా అంటూ కాస్త సొగసులను చూపించే ప్రయత్నం చేసింది. అయితే ఎంత చేసినా.. లిమిట్స్ మాత్రం దాటలేదు. కానీ ఇప్పుడు కాస్త లిమిట్స్ క్రాస్ చేసినట్లే కనిపిస్తోంది. ఆ వ్యవహారంలోకి వెళితే..

Advertisement
CJ Advs

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో తన వరకు వచ్చిన సినిమాలను చేస్తూ వెళుతుంది. అయితే ఇక్కడామెకు అనుకున్నంతగా అయితే అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్‌పై కన్నేసిన ఆమెకు.. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే బాలీవుడ్ అనగానే.. అక్కడ పద్ధతిగా ఉంటామంటే చెల్లదు కాబట్టి.. కీర్తి కూడా తన అందాల గేట్లు ఎత్తేసినట్లుగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది. రీసెంట్‌గా బేబీ జాన్ సెట్‌లో వరుణ్ ధావన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుక సమయంలో ఓ పాటను షూట్ చేస్తున్నట్లుగా ఓ వీడియో బయటికి వచ్చింది. 

ఈ వీడియోలో కీర్తి సురేష్ అవతారం చూసిన వారంతా.. బాలీవుడ్ అంటే ఆ మాత్రం తప్పదు మరి. అక్కడ కీర్తి అయినా, ఇంకెవరైనా సరే.. గ్లామర్ ప్రదర్శన చేయాల్సిందే.. అనేలా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా కీర్తి సురేష్ కనబడిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. కారణం ఇంత వరకు ఆమె అలా కనిపించలేదు మరి. చాలా తక్కువగా దుస్తులు ధరించిన కీర్తి సురేష్ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తర్వాత.. కీర్తిపై వచ్చే కామెంట్స్‌ని కంట్రోల్ చేయతరమా.. 

Keerthy Suresh Photos From Baby John Goes Viral:

Keerthy Suresh Starts Exposing with Bollywood Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs