Advertisement
Google Ads BL

ఫైనల్లీ భర్త ఎవరో ఇలియానా చెప్పేసింది


గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం తన కొడుకుతో ఎంజాయ్ చేయడమే కాదు.. ఆ బాబు బాగోగులు చూసుకుంటూ చాలా బిజీగా ఉంది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటినుంచి కొడుకు పుట్టేవరకు, తన కొడుకుతో పడుతున్న చిలిపి కష్టాలను గురించి ఎప్పటికప్పుడు ఇలియానా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. అయితే ఇలియానా ప్రెగ్నెంట్ అన్న విషయం ప్రకటించిన్నప్పుడు ఆమె భర్త పేరు బయటపెట్టలేదు. 

Advertisement
CJ Advs

బాబు పుట్టబోయే ముందు తన పార్ట్నర్ మైఖేల్‌ని పరిచయం చేసింది. అప్పట్లో ఇలియానాపై చాలా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఆ ట్రోలింగ్‌పై ఇలియానా ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మైఖేల్‌తో తన లైఫ్ చాలా అద్భుతంగా సాగుతుంది, తాను డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడినప్పుడు మైకేల్ తనని బాగా చూసుకున్నాడని, హ్యాపీ అయినా, బాధ అయినా అతను తనకి అండగా నిలిచాడంటూ తన భర్తపై ఇలియానా పొగడ్తలు కురిపించింది. 

మైఖేల్‌ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అనేది మాటల్లో చెప్పలేను అంటూ చెప్పింది, అంతేకాకుండా తన భర్త, ఫ్యామిలీపై ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితే తాను తట్టుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యింది ఇలియానా. మొత్తానికి ఈ రూపంలోనైనా.. ఇలియానా తన భర్త ఎవరో చెప్పింది అంటూ అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఎందుకంటే, మొన్నటి వరకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ అంతా ఇలియానాపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Finally Ileana Reacted on Her Husband:

Ileana DCruz confirms marriage, talks about husband Michael Dolan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs