సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరూ రాబోయే కుర్ర హీరోలకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్ తర్వాత కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. వరస వైఫల్యాలు ఇబ్బంది పెడుతున్నా తన కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళుతున్నాడు. రౌడీ బ్రాండ్స్ అంటూ క్లోతింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు.
ఇక సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ చిత్రాలతో ప్రేక్షకులకి అమాంతం దగ్గరయ్యాడు. కేవలం నటనే కాదు, సిద్దు మంచి రైటర్ కూడా. తనలోని ప్రతిభకి పని చెబుతూ హీరోగా, రైటర్ గా కష్టపడుతూ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు ఈ యువ హీరో. సోలో గా ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ లేకుండా పైకి వచ్చిన ఈ హీరోల మధ్యన ఈ రోజు బిగ్ ఫైట్ జరుగుతుంది.
అదే సిద్దు జొన్నల గడ్డ నటించిన టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఈరోజు శుక్రవారం ఏప్రిల్ 26 న ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఆల్రెడీ థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్, ఇక విజయ్ ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. ఓటీటీలో దీనికి స్పెషల్ క్రేజ్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు.
టిల్లు స్క్వేర్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రాగా.. ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీలో విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ఓటీటీలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నవో కాస్త వేచి చూస్తే తెలుస్తుంది.