జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీనియర్ నటుడు నరేష్ తాజాగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోని వారు, అలాగే కొందరు పేటీఎమ్ బ్యాచ్ సోషల్ మీడియాలో రాంగ్‌గా ప్రొజక్ట్ చేశారు. అయితే జనసైనికులు, కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణని పవన్ కళ్యాణ్ విమర్శించలేదని, సరిగ్గా వీడియో చూడండి అంటూ కౌంటర్ ఇవ్వడంతో పేటీఎమ్ బ్యాచ్ మళ్లీ ఫెయిలైంది.
అసలీ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. ఒకప్పుడు ఎన్టీఆర్‌గారిని కృష్ణగారు విభేదించారు. పొలిటికల్‌గా ఇద్దరిదీ చెరొకదారి. అయినా కూడా ఎన్టీఆర్‌గారు కృష్ణగారి సినిమాలను ఇబ్బంది పెట్టలేదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతి పక్షాన్ని ఇబ్బంది పెట్టిన తీరుని, అలాగే తన సినిమాల విషయంలో వ్యవహరించిన తీరుని తెలియజేసేలా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో కృష్ణగారిని విమర్శించిందేం లేదు. ఇదే మాట ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ కూడా చెప్పారు. ఎన్టీఆర్‌గారిని వ్యతిరేకించినా.. తననెప్పుడూ ఆయన ఇబ్బంది పెట్టలేదని స్వయంగా కృష్ణ చెబుతున్న వీడియోని జనసైనికులు ట్విట్టర్ మాధ్యమంలో వైరల్ చేయడంతో.. ఈ గొడవ సద్దుమణిగింది.
ఇప్పుడు నరేష్ ట్విట్టర్ వేదికగా కొన్ని వీడియోలు షేర్ చేసి.. కృష్ణగారి పేరు తీసుకురాకుండా ప్రచారం చేసుకోవాలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పవన్ అంటూ కూటమి గెలవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే నరేష్ చేసిన ఈ ట్వీట్‌కు.. నెటిజన్లు, జనసేన-టీడీపీ కార్యకర్తలు ఒకసారి ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఏమన్నారో పూర్తిగా చూసి మాట్లాడండి అంటూ సజెషన్స్ ఇస్తుండటం విశేషం.