Advertisement
Google Ads BL

తమ్ముడు ఫైట్ చేస్తున్నాడు


రామోజీ ఫిల్మ్ సిటీలో తమ్ముడు ఫైట్ చేస్తున్నాడు.. అర్థం కాలేదా? పవన్ కళ్యాణ్ భక్తుడు నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ ఈ టైటిల్‌తో సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడదే టైటిల్‌తో నితిన్ సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అదీకాక.. పవన్ కళ్యాణ్‌తో వకీల్‌సాబ్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ వేణు.. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్‌కు కారణమవుతుంది.

Advertisement
CJ Advs

తాజాగా ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రొడక్షన్ డిజైనర్ మునిశేఖర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో.. ఫైట్ మాస్టర్ విక్రమ్ మోర్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ చేయనున్నారని, ఈ ఫైట్ సీన్ సినిమాకు ఎంతో కీలకమని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్‌కు కూడా ఓ మంచి హిట్ కావాలి. అలాగే దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా మరోసారి తన సత్తా చాటాల్సి ఉండటంతో.. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.

తమ్ముడు, అక్క బంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సప్తమిగౌడ ఇందులో నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 

Nithiin Thammudu Movie Latest Update :

Nithiin in Acton For Thammudu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs