అవును.. శత్రువులు ఎక్కడో ఉండరబ్బా మన చుట్టూనే ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు కదా..! ఇప్పుడు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఇలాగే ఫీలవుతున్నారట. ఎందుకంటే.. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. కొడుకును బాగా హర్ట్ చేశాయట. దీంతో ఈ మాటలకు ఏం చేయాలో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారట. ఇక ఆయన అనుచరులు, వీరాభిమానులు అయితే బాబోయ్.. బాపు ఇలా అన్నారేంట్రా అని ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ ఏం జరిగింది..? బాస్ ఏం చెప్పారు..? కేటీఆర్ బీపీ ఆ రేంజ్‌లో ఎందుకు పెరిగిందనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.
ఇదేంది బాపూ!
ఒకటి కాదు రెండు కాదు కొన్నేళ్ల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా ఏకంగా నాలుగు గంటల లైవ్ షో.. చానెల్ పేరుగాంచినది కావడంతో జనాలు అతుక్కుపోయారు. ఉద్యమం మొదలుకుని పార్టీ ఓడిన పరిస్థితి, కాంగ్రెస్‌కు కౌంటర్ ఇలా ఏ ఒక్కటీ మిస్ కాకుండా చెప్పేశారు. అంతేకాదు.. పనిలో పనిగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌దే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటితో ఆగని కేసీఆర్.. తానే ముఖ్యమంత్రినని కూడా చెప్పేశారు. ఈ మాటతోనే కేటీఆర్‌కు బీపీ ఓ రేంజ్‌లో పెరిగిపోయిందట. ఇంకెన్నాళ్లు మీరే బాపూ అని బయటికి చెప్పలేకపోయినా.. మనసులో గట్టిగానే అనుకున్నారట. ఈ విషయాలన్నీ తన ఆత్మీయులకు చెప్పుకుని మదనపడ్డారట.
కష్టమే కేటీఆర్!
పరిస్థితులన్నీ అనువుగా ఉన్నప్పుడే ఏ తండ్రి అయినా కుమారుడ్ని పైకి తీసుకురావాలని కోరుకుంటాడన్నది జగమెరిగిన సత్యమే. అలాంటిది ఇప్పటికే గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులున్నాయి. అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పార్టీకి అన్నీ తానై కేటీఆర్ చూసుకుంటున్నారని అందరికీ తెలిసిందే. ఇంత చేస్తున్న కేటీఆర్ బాపు మాటలకు నొచ్చుకున్నారట. శత్రువులు అనే వాళ్లు ఎక్కడో ఉండరన్నది కేటీఆర్ బాగా తెలిసొచ్చిందనే టాక్ గట్టిగానే నడుస్తోంది. కేసీఆర్ మాటలను బట్టి చూస్తే.. సీఎం కావాలనుకున్న కేటీఆర్ కోరిక ఇప్పట్లో నెరవేరదేమో. సో.. దీన్ని బట్టి చూస్తే తక్కువలో తక్కువ పదేళ్లయినా కేటీఆర్ వేచి చూడక తప్పదేమో సుమీ..!. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయానికి నువ్వంటే.. నువ్వే కారణమని అబ్బా కొడుకుల మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని బయట టాక్ నడుస్తోంది. తాజా ఇంటర్వ్యూతో కేసీఆర్‌పై కేటీఆర్‌కు కోపం వచ్చున్నా.. ఆ ఆక్రోశాన్ని, బాధను ఆత్మీయులతో పంచుకోని ఉన్నా పెద్ద ఆశ్చర్యపోయేది ఏముంది మరి.!!