Advertisement
Google Ads BL

పీకే దెబ్బ.. నారా లోకేష్ అడ్రస్ లేరబ్బా!


టీడీపీ భవిష్యత్తు, ఆశ, అంతకుమించి నమ్మకం.. భావి ముఖ్యమంత్రి అని పసుపుదళం చెప్పుకునే యువనేత నారా లోకేష్ ఎక్కడున్నారు..? ఏమైపోయారు..? అసలు ఎన్నికల బరిలో ఉన్నారా.. తప్పుకున్నారా..? అనేది ఏపీ రాజకీయాల్లో ఓ రేంజులో నడుస్తున్న చర్చ. చిన బాబుగారి అడ్రస్ తెలిస్తే చెప్పండయ్యా అని కొందరు అంటుంటే.. అబ్బే అదేం లేదు ఓటమిని ముందుగానే ఒప్పుకునే మిన్నకుండిపోయారని మరికొందరు చెబుతున్న పరిస్థితి. డూ ఆర్ డైగా నడుస్తున్న ఎన్నికల్లో లోకేష్ కనిపించకపోవడంతో సామాన్యులకైనా ఇలాంటి సందేహాలు రావడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఇంతకీ యువనేత ఏమయ్యారు..? పీకే చెప్పినట్లుగానే పిన్ టూ పిన్ ఆయన అమలు చేస్తున్నారా..? జనాల్లో.. మరీ ముఖ్యంగా టీడీపీలో జరుగుతున్న ఇన్‌సైడ్ టాక్ ఏంటి..? సోషల్ మీడియాలో నడుస్తున్న రచ్చేంటనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..!

Advertisement
CJ Advs

ఏం జరుగుతోంది..?

ఎన్నికల హీట్ పెరిగినా.. లోకేష్ ఎక్కడా ప్రచారంలోగానీ, పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడానికి చాలానే కారణాలున్నాయనే చర్చలు పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. అయితే టీడీపీ వర్గాల నుంచి లీకుల ద్వారా ఈ మధ్య ఆ పార్టీ వ్యూహాలు, పరువు తీసే వీడియోలు తెగ రిలీజ్ అవుతున్నాయ్. అలాగే లోకేష్ గురించి ఓ సీరియస్ చర్చ అయితే నడుస్తోంది. అదేమిటంటే.. పైకి టీడీపీకి తాను పనిచేయట్లేదని, అస్సలు సంబంధమే లేదని చెబుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. అక్షరాలా సైకిల్ పార్టీకోసం పనిచేస్తున్నారని ఆయన నోటి నుంచి వచ్చే మాటలు.. టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. అదలా ఉంచితే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, సీఎం రమేష్ కలిసి నిర్వహించిన అంతర్గత సమావేశంలో.. పిలవకుండానే నారా లోకేష్ కూడా పాల్గొన్నారట. అయితే మాటల మధ్యలో అనరాని మాట అని చినబాబు నోరు జారాడట. దీంతో ఇన్ని వ్యూహాలు, ఇదంతా దేనికోసం అనుకుంటున్నావ్..? అని పీకే, రమేష్ కన్నెర్రజేశారట. దీన్ని ఒకింత అవమానంగా భావించిన లోకేష్.. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్లిపోయారట. ఈ విషయాలు వైసీపీ శ్రేణులకు తెలియడంతో సోషల్ మీడియాలో ఓ రేంజులో చినబాబును ఆడుకుంటున్నారు. పీకే దెబ్బ లోకేష్ అబ్బా అని చెప్పుకుంటున్నారు.

బాబుకు పీకే ఏం చెప్పారు..? 

ఇదే అంతర్గత సమావేశంలో చంద్రబాబుకు పీకే ఓ కీలక సలహా, సూచన చేశారట. ఏపీలో జరుగుతున్న, జరగబోయే బహిరంగ సభల్లో ఎక్కడా లోకేష్ పాల్గొనకుండా చూడాలన్నారట. ఎందుకంటే.. ఇలాంటి కొన్ని అంతర్గత విషయాలు టపీమని నోటి నుంచి బయటికొస్తే బాగోదని ఎన్నికల వరకు సభల్లో పాల్గొనవద్దని పీకే ఎలాంటి మొహమాటం లేకుంటే చెప్పేశారట. అంతేకాదు.. మంగళగిరిలో గెలుపు మాత్రమే చూసుకోవాలని.. మిగిలిన నియోజకవర్గాలతో, మిగిలిన అభ్యర్థులతో సంబంధం లేదన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబుకు పీకే క్లియర్ కట్‌గా చెప్పేశారట. దీంతో నాటి నుంచి నేటి వరకూ లోకేష్ ఏ సభలోనూ కనిపించడం లేదన్నది ఇన్‌సైడ్ టాక్. అయితే.. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో నిర్వహించిన చిన్నచిన్న కార్యక్రమాలకు మాత్రం చినబాబుకు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీలో నాయకత్వ లక్షణాల లేమి.. ముఖ్యంగా లోకేష్ పరిస్థితికి ఇదంతా నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇందులో నిజానిజాలెంతో లోకేష్‌కు.. తెలుగు తమ్ముళ్లకే తెలియాలి మరి.

PK Strategy on Nara Lokesh:

PK Suggestion to Chandrababu About Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs