Advertisement
Google Ads BL

పిఠాపురంలో మెగాస్టార్ ప్రచారం నిజమేనా?


మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఇప్పుడు తన తమ్ముడు కోసం.. పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న ఆయన మరోసారి రంగంలోకి దిగబోతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

మే 13వ తేదీ లోపు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఒక రోజంతా ప్రచారం నిర్వహించనున్నారట. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వారాహిపై పిఠాపురం వీధుల్లో ప్రచారం చేసే అపురూపమైన సందర్భం అతి త్వరలోనే ఉండబోతుందనేలా టాక్ మొదలైంది. ఇదే కనుక నిజమైతే మాత్రం.. పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. అయితే, చిరు ప్రచార కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రీసెంట్‌గా కూటమి తరపున పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌కు, CM రమేష్‌కు మెగాస్టార్ తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విశ్వంభర సెట్స్‌కు పిలిపించుకుని మరీ రూ. 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీ ఖర్చుల కోసం చిరంజీవి ఇచ్చి.. తన తమ్ముడికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు మే 5వ తేదీన పిఠాపురానికి మెగాస్టార్ చిరంజీవి రానున్నారని, ఆ రోజే తన తమ్ముడి కోసం ఒక రోజంతా ప్రచారం నిర్వహిస్తారనేలా టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో..

Megarstar Chiranjeevi for Pawan Kalyan:

Megastar Chiranjeevi will Campaign for Pawan Kalyan in Pithapuram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs