Advertisement
Google Ads BL

పోలీస్ ఆఫీసర్‌గా కింగ్..


కింగ్ నాగార్జున ఇప్పుడు సోలో హీరోగా సినిమాలు చేయడం తగ్గించి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ది ఘోస్ట్ నిరాశ పరిచాక.. నా సామిరంగ చిత్రంతో హిట్ కొట్టిన నాగార్జున అంతకుముందు రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రలో స్పెషల్ రోల్‌లో నటించారు. నా సామిరంగ తర్వాత ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల చిత్రం కుబేరాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న కూలీ చిత్రంలోనూ నాగార్జున నటిస్తున్నారని, లోకేష్ కనగరాజ్ నాగార్జున కోసం కూలీలో ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేశాడని చెబుతున్నారు. నాగార్జున సూపర్ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు అనే విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. 

అయితే కింగ్ నాగార్జున ఇప్పడు పోలీస్ అవతారమెత్తబోతున్నారట. అది ధనుష్ మూవీ కుబేరలో నాగార్జున పోలీస్ డ్రెస్ వెయ్యబోతున్నట్లుగా తెలుస్తోంది. కుబేర లో కింగ్ నాగ్ నెగిటివ్ టచ్ ఉన్న మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక రజినీ సినిమాలో నాగ్ ప్లే చేసే పాత్ర ఎలా ఉండబోతుందో అనేలా కూడా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం.

King Nagarjuna Plays Police Officer Role in Dhanush Kubera:

Gossips on King Nagarjuna Role in Kubera
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs