సినిమా సెట్స్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉండే రష్మిక మందన్న తన ఫోటో షూట్స్ తోనో, లేదంటే పర్సనల్ విషయాలతో, లేదంటే అభిమానులతో చిట్ చాట్ చేస్తూనో ఏదో ఒక విషయంగా సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంటుంది. తన మోడ్రెన్ ఫోటో షూట్స్ మాత్రమే కాదు, శారీ లుక్స్‌ని కూడా పోస్ట్ చేస్తుంది.
తనకి చీరలోనే ఎక్కువగా కంఫర్ట్‌గా ఉంటుంది అని చెప్పే రష్మిక తాజాగా వదిలిన పిక్స్‌లో లైట్ వెయిట్ చీరలో చూడముచ్చటగా కనిపించింది. తన పప్పితో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ.. Summer days with my girl ❤️#Missinghome అంటూ క్యాప్షన్ పెట్టింది. తన పెట్‌తో ఉన్న పిక్‌తో పాటుగా తాను ఇంటిని మిస్ అవుతున్నట్టుగా రష్మిక రాసుకొచ్చింది.
మరి హీరోయిన్స్ అన్నాక షూటింగ్స్ కోసం తరచూ అవుట్ డోర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీకి దూరంగా టైం స్పెండ్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది నటీనటులెవరికైనా కామనే.. దానినే రష్మిక ఇలా ఫొటోస్ షేర్ చేసి మరీ హోమ్‌ని మిస్ అవుతున్నట్టుగా చెప్పింది. ప్రస్తుతం ఆమె పుష్ప2 తో పాటు ఓ నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేనంతగా షూటింగ్స్‌లో మునిగిపోతోంది.