Advertisement
Google Ads BL

పవన్ నామినేషన్ చెల్లదా.. ఎందుకిలా?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ చెల్లదా..? మంగళవారం నాడు (ఏప్రిల్-23న) పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పులున్నాయా..? సరిగ్గా ఇక్కడే సేనాని దొరికిపోయారా..? తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న  చర్చేంటి..? ఇందులో నిజానిజాలెంత..? ఓ వర్గం నెట్టింట్లో చేస్తున్న ప్రచారంలో నిజమెంత..? ఇందుకు జనసేన ఏమని బదులిస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం వచ్చేయండి మరి..!

Advertisement
CJ Advs

ఇదేం పైత్యం రా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అతి కొద్దిరోజులే సమయం ఉంది.. ఒకట్రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం కూడా ముగియబోతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయగా.. దీన్ని పిన్ టూ పిన్ పరిశీలించి మరీ వైసీపీ కార్యకర్తలు, నేతలు తెగ ట్రోల్ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు అఫిడవిట్‌తో పరిశీలించి మరీ ఆస్తుల లెక్కలు తీస్తున్నారు. గతానికి.. నేటికి భారీగానే ఆస్తులు మాత్రం పెరిగాయి. అంతటితో ఆగలేదు.. ఆయన మీదున్న కార్లు, వారాహి వాహనం ఎక్కడిది..? కొన్నారా.. వేరొకరు ఇచ్చారా..? పవన్ భార్య మీదున్న ఆస్తులెంత..? ఇంతకీ భార్య అన్నా లెజినోవాతో కలిసే పవన్ ఉంటున్నారా.. లేకుంటే విడిపోయారా..? అఫిడవిట్‌లో ఎంత మంది పిల్లలు ఉన్నట్లు రాసుకొచ్చారు..? ఇలా లేనిపోని ప్రశ్నలతో జనసేన శ్రేణులను గందరగోళంలోనికి నెట్టేశారు.. వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు.

నిజమా.. చెల్లదా..?

పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో భార్య పేరిట ఆస్తులు ఎన్ని ఉన్నాయి అని ప్రకటించారా..? లేదా.. లేనిచో విడాకులు ఇచ్చేసినట్టే..? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. దీనికి వైసీపీ కార్యకర్తలు ఎంత రచ్చ చేస్తున్నారంటే.. ప్రకటించలేదని, పిల్లలకు కూడా రష్యా పౌరసత్వం ఉందని రాసుకొచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే అఫిడవిట్ చెల్లదని.. పవన్, భార్య ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని అర్థమని.. రష్యా పౌరసత్వం అయినా పెళ్లి చేసుకున్నాక ఇక్కడి పౌరసత్వం వర్తిస్తుందనేది గట్టిగా ఆలోచించాల్సిన విషయమంటూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే.. లెజినోవాకు రెండు కోట్లు విలువైన ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు మాత్రమే ఇందులో చూపించడం గమనార్హం. దీంతోనే పవన్ ఇరుక్కున్నాడని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. వాస్తవానికి పవన్.. వ్యక్తిగతంగా ఆమె పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయో చూపించాల్సిందేనన్నది మరికొందరి వాదన. దీంతో జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం అనేది తెలియక తికమకపడుతున్నారు.

ఇవే పవన్ ఆస్తులు..!

పవన్ మొత్తం ఆస్తులు : రూ.41కోట్ల 65 లక్షల విలువ చేసే బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం

రూ.2 కోట్ల విలువ చేసే 1,680 గ్రాముల బంగారం, డైమండ్లు

10 కార్లు, ఒక హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రూ.94 కోట్ల 41 లక్షల విలువైనవి

భార్య కొణిదెల అన్నా పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం రూ.కోటి 22 వేల విలువైన ఆస్తులు

నలుగురు పిల్లలు.. అకీరా నందన్ మేజర్, మిగిలిన ముగ్గురూ మైనర్లు

మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికీ రూ. 11 కోట్ల ఖరీదైన భూములు

కొణిదెల సురేఖ నుంచి రూ.2 కోట్ల అప్పు తీసుకున్నట్లు ప్రకటన

అప్పలు : రూ.65 కోట్ల 76 లక్షల రూపాయలు

ఎవరి దగ్గర అప్పలు : మైత్రి మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ

చదువు : పదో తరగతి (నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 1984) ఇవీ పవన్ కల్యాణ్ క్లియర్ కట్‌గా చూపించిన ఆస్తులు, అప్పుల వివరాలు.. ఇక ఇందులో దాపరికం ఏముంది.. ఎందుకింతలా ట్రోల్ చేస్తున్నారన్నది వైసీపీ కార్యకర్తల మనస్సాక్షికే తెలియాలి. ఇలాంటి విషయాలపై జనసేన పార్టీ అధికారికంగా స్పందించి గట్టిగానే కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

YSRCP Trolling on Pawan Kalyan Nomination:

Pawan Kalyan Declares Assets As He Files Nomination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs