Advertisement
Google Ads BL

విజయ్‌తో ప్రశాంత్ నీల్ అయ్యే పనేనా?


సలార్ పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైన ప్రశాంత్ నీల్.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సలార్ 2 షూటింగ్ పూర్తి కావాలంటే 2025 అంటే వచ్చే ఏడాది అవుతుంది. ఆ తర్వాత విడుదల కోసం మరో ఆరు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్‌కి కమిట్మెంట్ ఉంది. అది పూర్తయ్యేసరికి మరో ఏడాది అంటే 2026 నుంచి 27 వరకు పట్టినా పట్టొచ్చు. ఆ సినిమా తర్వాత ఆయన మెగా కాంపౌండ్‌లోకి వెళ్లే అవకాశం పుష్కలంగా ఉంది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు సడన్‌గా విజయ్ దేవరకొండ‌తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండొచ్చేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కారణం విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రశాంత్ నీల్ కనిపించేసరికి అందరూ అదే అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ - విజయ్ దేవరకొండ కాంబో మూవీ సెట్ అయ్యే సూచనలు ఉన్నాయంటూ ప్రచారం షురూ అయ్యింది. 

అసలు ఈ కాంబో సెట్ అవుతుందా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరస సినిమాల రిజల్ట్‌తో డిస్పాయింట్ అయ్యి ఉన్నాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూడు విజయ్‌ని నిరాశ పరిచాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో VD12 చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్‌తో విజయ్ మూవీ ఒకవేళ కన్ ఫర్మ్ అయినా.. ప్రశాంత్ నీల్ ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ సినిమాలని దాటుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. చూద్దాం వీరి కాంబో ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది!

Vijay Devarakonda, Prashant Neel Meet Trigger Rumours:

Whats Up: VD and Prashant Neel meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs