Advertisement
Google Ads BL

నామినేషన్ వేసిన బర్రెలక్క


గత తెలంగాణ ఎన్నికల్లో చాలా ప్రత్యేకంగా వినిపించిన పేరు బర్రెలక్క ఉరఫ్ శిరీష. స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా ఫేమస్ అయిన బర్రెలక్క ఎన్నికల్లో గెలిచి యువతకు మార్గదశిగా మారాలనుకుంది. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. 

Advertisement
CJ Advs

దానిలో నిరాశపడి బర్రెలక్క పెళ్లికి సిద్ధమైంది అనుకున్నారు. శిరీష వెంకటేష్ అనే యువకుడిని రీసెంట్ గానే వివాహం చేసుకుంది. తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటుంది అనుకుంటే.. బర్రెలక్క తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేసింది. మంగళవారం అంటే ఈరోజే ఆమె నామినేషన్ వేసింది. 

ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే తాను ప్రజల పక్షాన, యువతకు మేలు చేసే విధంగా నిలబడతానని చెబుతోంది. ప్రజా సమస్యలపై చట్టసభల్లో పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని అంటోంది. మరి కాంగ్రెస్, BRS , BJP లాంటి గట్టి అభ్యర్థులతో పోటీ పడి గెలిచే ఛాన్స్ వుందా.. అనేది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది. 

Barrelakka Aka Sirisha Files Nomination As MP candidate:

Shirisha from Kollapur filed a nomination from Nagarkurnool Lok Sabha constituency
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs