గత రెండు నెలలుగా అందరూ మలయాళ సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే.. అక్కడ నెలకి రెండు హిట్స్ అన్నట్టుగా వరస సినిమాలు ఇండస్ట్రీకి వరస సక్సెస్ లు తెచ్చిపెడుతున్నాయి. 100 కాదు రెండొందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలతో మల్లువుడ్ కళకళలాడుతుంది. ఓటీటీలే కాదు.. ఇప్పుడు థియేటర్స్ లోను మలయాళ చిత్రాలు పలు భాషల్లో డబ్ అయ్యి పాన్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తున్నాయి.
ఫిబ్రవరిలో ప్రేమలు, భ్రమయుగం.. ఆ తర్వాత మంజుమెల్ బాయ్స్.. ఇప్పుడు మరో ఆణిముత్యం మలయాళం బాక్సాఫీసుని గడగడలాడిస్తోంది. అదే పాహద్ ఫాజిల్, ఆశీష్ విద్యార్థిల ఆవేశం. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంది. కాలేజీ పాలిటిక్స్, బెంగళూరులో లోకల్ గుండాయిజంను కలుపుతూ తెరకెక్కించిన ఆవేశం సినిమాను భారీగానే అంటే 50 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.
ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాలు తిరక్కుండానే 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించడం మలయాళంలో మరో సెన్సేషన్ అయ్యింది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోను ఆవేశం అదరగొట్టేస్తుంది. మరి వరసగా మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో సినిమా చాలా తక్కువ సమయంలో 100 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.